పోలీసులు ఏడు నిమిషాల్లో చేసిన పని తెలిస్తే వావ్ అంటారు.. !

పోలీసు వ్యవస్ద అంటేనే విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.ఈ డిపార్ట్‌మెంట్‌లో కొందరు చేసే అవినీతి వల్ల మంచి వారికి కూడా విలువ తగ్గుతుందన్న విషయం తెలిసిందే.

అందుకే సమాజంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ పై ఉన్న చెడు భావాన్ని చెరిపివేయడానికి అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు.ఇందులో భాగంగా ప్రజలతో మమేకం అయ్యి వారిలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు.

ఇక ప్రజలకు ఆపద వస్తే పట్టించుకోని వారున్నారు, అడిగినంతనే సహాయ సహకారాలు అందించే వారు ఉన్నారు.ఇలా మంచి పోలీసుల గురించి తరచుగా మనం వార్తల్లో వింటూనే ఉన్నాం.

ఇలాంటి వార్తనే ఇప్పుడు మనం చదవబోయేది.ఇకపోతే మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో నిండు ప్రాణాలు కాపాడిన చెన్నూరు పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు.

Advertisement

చెన్నూరు లో నివసించే ఒక వ్యక్తి కుటుంబ సమస్యలతో బాధపడుతూ అత్మ హత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.ఈ క్రమంలో అతను తమ బంధువులకు ఫోన్ చేసి నేను ఉరి వేసుకుని మరణించడానికి సిద్దం అవుతున్నాను అంటూ ఒక వీడియో ద్వారా సమచారం అందించాడట.

ఈ విషయం తెలిసిన వెంటనే అతని తల్లితో పాటుగా బాధితుని మిత్రుడు చెన్నూరు పోలీసులను ఆశ్రయించారు.వెంటనే స్పందించిన చెన్నూరు సిఐ ప్రమోద్ రావు మరియు ఎస్ ఐ శివ కుమార్ బృందం రంగంలోకి దిగి, ఆ వ్యక్తి ఫోన్ ట్రేస్ చేసి ఏడు నిమిషాలలో పట్టుకొని నిండు ప్రాణాలు కాపాడి తన తల్లి వద్దకు చేర్చారు.

Advertisement

తాజా వార్తలు