జీతాలివ్వలేక చేతులెత్తేసిన ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం!

కొన్ని నెలల కిందటి వరకు ఆర్థికంగా ఎంతో ఎదిగిన దేశం, ప్రపంచ దేశాలలో సుసంపన్నమైన దేశాలలో ఒకటిగా పేరుగాంచింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల ప్రభావం వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి లోకి కువైట్ ఆర్థిక పరిస్థితి ఎంతగానో దిగజారిపోయింది.

ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి అని నానుడి ప్రస్తుతం కువైట్ పరిస్థితిని తెలియజేస్తుంది.

గత కొద్ది నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంతో దిగజారిపోయింది.అయితే ప్రపంచంలో ముడి చమురును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో కువైట్ ఒకటి.

ఈ దేశానికి దాదాపుగా 89% ఆదాయం ముడి చమురు నుండే వస్తుంది.అయితే కరోనా కారణం వల్ల ముడి చమురు నుండి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది.

Advertisement

అయితే ఆదాయం కోసం కువైట్ ప్రభుత్వం కొత్త రుణ చట్టాన్ని తెచ్చింది.కానీ చట్టాన్ని పార్లమెంట్ తిరస్కరించింది.

పార్లమెంట్ లో ఈ చట్టం అమలులోకి వస్తే కువైట్ తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.అప్పట్లో కువైట్ కు ముడిచమురు తో భారీ ఆదాయం ఉండడం వల్ల 2017 వ సంవత్సరం లో ఇంటర్నేషనల్ మార్కెట్ బ్రాండ్లను రిలీజ్ చేసి రుణాలను సమీకరించి ఉంది.

అయితే ప్రస్తుతం కరోనా కారణం వల్ల ముడి చమురు ఆదాయం భారీగా తగ్గిపోవడంతో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.గత కొద్ది నెలల కాలంలో కరోనా ప్రభావం వల్ల కువైట్ దేశం దాదాపుగా 46 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కొంటుంది.

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశంలో పని చేస్తున్న ఎంతోమంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేం అని చేతులు ఎత్తేసింది.దీంతో అందరూ షాక్ కి గురవ్వడమే కాకుండా కరోనా వైరస్ ఆర్ధికంగా ఎంత దారుణంగా దెబ్బ తీసింది అనడానికి నిదర్శనంగా మారిపోయింది.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు