World most expensive shahtoosh shawl: ఆ శాలువా కొనాలంటే మీ ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుంది... ధర ఎంతంటే?

శాలువా ఏమిటి? కొనడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి రావడం ఏమిటి అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమేనండి.శాలువాల్లోని ఖరీదయిన శాలువాల గురించి వినే వుంటారు.

పష్మీనా అనే పేరు మీరు విన్నారా? అయితే ధరలో ఈ పష్మినాను కూడా వెనక్కు నెట్టింది ఓ శాలువా.మల్బరీ షాల్ గురించి కొన్ని చోట్ల మనం తరచూ వింటూ ఉంటాం.

ఈ శాలువా ఖరీదు దాదాపు 15 లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం.అయితే, ఈ శాలువను భారతదేశంలో కొనుగోలు చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ నిషేధించబడింది.

షహతూష్ అనేది ఓ పర్షియన్ పదం, ఉన్ని రాజు అని దీని అర్ధం.ఇందులో వాడేది అత్యుత్తమమైన ఉన్ని కావున అత్యధిక నాణ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది.

Advertisement
World Most Expensive Shahtoosh Shawl Details, Shaluba, Viral Latest, News Viral,

చిరు అనే జంతువు జుట్టు నుండి మల్బరీ శాలువాలు సిద్ధం చేయబడ్డాయి అని చెబుతూ వుంటారు.చిరు అనేది టిబెట్ కొండల్లో కనిపించే జింకలాంటి ఓ జంతువు.

ఒక శాలువాను తయారు చేయడానికి 4 కంటే ఎక్కువ చిరులను చంపాలట.మల్బరీ వ్యాపారం పేరుతో ఏటా అనేక మంది చిరు హత్యలకు గురవుతున్నాయి.

అందువలనే వీటిని బ్యాన్ చేసారు.

World Most Expensive Shahtoosh Shawl Details, Shaluba, Viral Latest, News Viral,

దీని కారణంగానే ఇది చాలా ఖరీదైనది.1975లో, IUCN షహతూష్ షాల్‌పై నిషేధం విధించారు.దీని తరువాత, భారతదేశం కూడా 1990లో ఈ శాలువపై నిషేధం విధించడం గమనార్హం.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
వైరల్ వీడియో : మాజీ ప్రియుడి పెళ్లిలో ప్రియురాలు ఎంట్రీ.. చివరకు ఏం జరిగిందంటే?

షహతూష్ శాలువాల వ్యాపారం వల్ల చిరు చనిపోతున్నాయని పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేసిన తరుణంలో నిషేధాలు వెల్లువెత్తాయి.దాంతో ఆ శాలువాలు కూడా కనుమరుగయ్యాయి.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ శాలువా ధర 500 నుంచి 20 వేల డాలర్ల వరకు ఉంటుంది.అంటే ఒక శాలువా కోసం రూ.15 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు