Sridevi Janhvi Kapoor : హీరోయిన్ శ్రీదేవి కొన్న మొదటి ఇల్లును చూపించిన జాన్వీ కపూర్.. వైరల్ వీడియో?

నటి అతిలోక సుందరి అయినా శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది శ్రీదేవి.

 Janhvi Kapoor Home Tour Sridevi Boney Kapoor, Janhvi Kapoor, Bollywood, Sri Devi-TeluguStop.com

ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లినప్పటికీ ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.కాగా శ్రీదేవి మరణంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ లోకం కంటతడి పెట్టింది.

అంతే కాకుండా ఆమెను ఆఖరి చూపు చూసుకోవడం కోసం వేలాదిమంది అభిమానులు తరలి వచ్చారు.ఇకపోతే శ్రీదేవికి సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి.

అయితే ఎవరికీ తెలియని అలాగే శ్రీదేవి ఎంతో ఇష్టపడి చెన్నైలో నిర్మించుకున్న ఒక ఇంటిని ముద్దుల కూతురు హీరోయిన్ జాన్వి కపూర్ తాజాగా అభిమానులకు చూపించింద.అంతేకాకుండా శ్రీదేవి ఆ ఇంటిని తన తొలి ప్రాపర్టీతో నిర్మించుకున్నట్టుగా జాన్వికపూర్ చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా లాక్డౌన్ సమయంలో తన సోదరి ఖుషి కపూర్ తో పుట్టిన రోజు వేడుకలు ఆ ఇంట్లోనే చేసినట్టుగా చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.శ్రీదేవి తొలి ప్రాపర్టీతో నిర్మించిన ఆ ఇంటిని హోమ్ టూర్ లో భాగంగా ప్రతి ఒక్కటి చూపిస్తూ ఆ రోజులను గుర్తు చేసుకుంది జాన్వికపూర్.

ఆ వీడియోలో బెడ్ రూమ్,డైనింగ్ హాల్, సీక్రెట్ రూమ్, టీవీ రూమ్ ప్రతి ఒక్కదాన్ని చూపిస్తూ వాటి విషయాలను చెప్పుకొచ్చింది జాన్వి కపూర్.కాగా ఖుషి కపూర్ తో ఎక్కువ సమయం టీవీ రూమ్ లో గడిపినట్లు తెలిపింది.తమకు పెయింటింగ్ వేయడం చాలా ఇష్టమని వాటిని కూడా చూపించింది జాన్వి.ఆ ఇంట్లోనే జాహ్నవి కపూర్ తండ్రి ప్రముఖ నిర్మాత అయిన బోని కపూర్ ఆఫీస్ కూడా ఉండేది అని ఆమె తెలిపింది.

ఆ ఇంట్లో గోడలపై శ్రీదేవి బోనీ కపూర్ లో చిన్ననాటి ఫోటోలు వారి పెళ్లి ఫోటోలు అలాగే ఎన్నో రకాల ఫోటోలను చూపించింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube