రోజూ వెయిట్ లిఫ్టింగ్ చేస్తే ఎన్ని ఆరోగ్య లాభాలు ల‌భిస్తాయో తెలుసా?

వెయిట్ లిఫ్టింగ్.అద్భుత‌మైన వ్యాయామాల్లో ఇది ఒక‌టి.

ఇది మగవాళ్లకు మాత్ర‌మే సంబంధించిన వ్యాయామం అని చాలా మంది భావిస్తుంటారు.

కానీ, మ‌హిళ‌లు కూడా వెయిట్ లిఫ్టింగ్ చేయ‌వ‌చ్చు.

వెయిట్ లిఫ్టింగ్ అనేది కొంచెం క‌ష్ట‌త‌రంగా ఉన్నా.స్త్రీ, పురుషులిద్ద‌రికీ ఇది అనేక‌ ఆరోగ్య లాభాల‌ను అందిస్తుంది.

మ‌రి ఆ లాభాలు ఏంటి.? అస‌లు వెయిట్ లిఫ్టింగ్ ఎందుకు చేయాలి.? వంటి విష‌యాల‌ను ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.వెయిట్ లిఫ్టింగ్ చేయ‌డం వ‌ల్ల మెట‌బాలిజం రేటు పెరుగుతుంది.

Advertisement

మెట‌బాలిజం రేటు పెరిగితే శ‌రీరంలో క్యాల‌రీలు వేగంగా క‌రుగుతాయి.అందువ‌ల్ల వేగంగా బ‌రువు త‌గ్గాల‌ని భావించే వారు రెగ్యుల‌ర్‌గా వెయిట్ లిఫ్టింగ్ చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంద‌ని అంటున్నారు.

ఎముక‌ల ఆరోగ్యానికి వెయిట్ లిఫ్టింగ్ ఎంతో మేలు చేస్తుంది.వెయిట్ లిఫ్టింగ్ వ‌ల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది.

దాంతో విర‌గ‌డం, ఫ్రాక్చర్లు అవ్వడం లాంటివి త‌గ్గుతాయి.కండరాల నిర్మాణం కూడా బాగుంటుంది.

అలాగే డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డేవారికి వెయిట్ లిఫ్టింగ్ ఓ న్యాచుర‌ల్ మెడిసిన్ లా ప‌ని చేస్తుంది.రోజూ కాసేపు వెయిట్ లిఫ్టింగ్ చేస్తే డిప్రెష‌న్ నుండి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌తారు.మెద‌డు ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

వెయిట్ లిఫ్టింగ్ వ‌ల్ల చ‌క్క‌టి నిద్ర ప‌డుతుంది.నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అయ్యేవారు వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాన్ని అల‌వాటు చేసుకుంటే.

Advertisement

ఆ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌తారు.అంతేకాదు, వెయిట్ లిఫ్టింగ్ చేయ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.మ‌రియు బెల్లీ ఫ్యాట్ స‌మ‌స్య నుండి సైతం విముక్తి ల‌భిస్తుంది.

ఇన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది కాబ‌ట్టే.వెయిట్ లిఫ్టింగ్‌ను డైలీ రొటీన్‌లో భాగం చేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే వెయిట్ లిఫ్టింగ్ అనేది శిక్షకుల సమక్షంలోనే చేయాలి.

తాజా వార్తలు