సోంపు తింటే ఎన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా?

సోంపు.చూడ‌టానికి జీల‌క‌ర్రలా ఉంటుంది.

కానీ, చాలా రుచిగా ఉంటుంది.

భోజ‌నం త‌ర్వాత చాలా మందికి సోంపు తినే అల‌వాటు ఉంటుంది.

ఎందుకంటే.సోంపు తిన‌డం వ‌ల్ల ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది.

మలబద్దకాన్ని తగ్గిస్తుంది.అంతేకాదు, సోంపుతో బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Advertisement

సోంపును డైలీ డైట్‌లో చేర్చుకుంటే.అనేక స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌.

మ‌రి సోంపు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటో లేట్ చేయ‌కుండా.ఇప్పుడు తెలుసుకుందాం.

నేటి కాలంలో చాలా మంది మ‌ధుమేహం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు.అర‌వై, డ‌బ్బై ఏళ్ల‌కు రావాల్సిన ఈ డయాబెటిస్.

ఇప్పుడు పాతికేళ్లకే వ‌చ్చేసింది.అయితే అలాంటి వారికి సోంపు ఓ ఔష‌ధంలా ప‌నిచేస్తుంది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ప్ర‌తి రోజు కొన్ని సోంపు గింజ‌లు తిన‌డం వ‌ల్ల మ‌ధుమేహం వ్యాధిగ్రస్థుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

Advertisement

అలాగే సోంపు గింజ‌ల్లో ఐర‌న్ పుష్క‌లంగా దొరుకుతుంది.ర‌క్తహీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు సోంపు ప్ర‌తి రోజు తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.సోంపు గింజల్లో విటమిన్ సి కూడా ఉంటుంది.

ఇది శ‌రీర‌ రోగ నిరోధక వ్యవస్థను బ‌ల‌ప‌డేలా చేస్తుంది.అదేవిధంగా, సోంపులో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోష‌కాలు.

ఎముకల‌ను దృఢంగా మారుస్తాయి.అధిక ర‌క్త‌పోటును అదుపులో ఉంచుతుంది.

రక్తపోటును అదుపు చేయడంలో పొటాషియం కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే.ఇక ప్ర‌తి రోజు ఒక స్పూన్ సోంపు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది.

మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.త‌ద్వారా శ‌రీర బ‌రువు త‌గ్గ‌డంతో పాటు గుండె జ‌బ్బులు సైతం రాకుండా ర‌క్షిస్తుంది.

కాబ‌ట్టి, సోంపును డైరెక్ట్‌గా తిన‌డంగాని లేదా.వంట‌ల్లో వేసుకుని తినడం గానీ చేయాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు