బియ్యం కడిగిన నీటితో ఇన్ని ప్రయోజనాలా? అస్సలు ఊహించలేరు!

సాధారణంగా చాలా మంది బియ్యం కడిగిన నీటిని బయట పారబోసేస్తుంటారు.

కానీ బియ్యం కడిగిన నీటితో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు ముఖ్యంగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేందుకు మరియు జుట్టు సంరక్షణకు బియ్యం కడిగిన నీరు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.

బియ్యం కడిగిన వాటర్ తో క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను తమ సొంతం చేసుకోవచ్చు.అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.

ముందుగా ఒక కప్పు బియ్యాన్ని వాటర్ తో ఒకసారి వాష్ చేసి.ఆ తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసి మూడు, నాలుగు గంట‌ల పాటు నానబెట్టుకోవాలి.ఆపై స్టైనర్ సహాయంతో రైస్ వాటర్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, చిటికెడు కుంకుమపువ్వు వేసి బాగా కలిపి ఐదు నిమిషాల పాటు వదిలేస్తే ఓ అదిరిపోయే ఫేస్ టోనర్ సిద్ధమవుతుంది.ఈ టోనర్ ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

Advertisement

రోజుకు రెండు సార్లు ఈ టోనర్ ను వాడితే ముఖం పై మొండి మచ్చలు, మొటిమలు, ముడ‌త‌లు తొలగిపోయి స్కిన్ క్లియర్ గా మారుతుంది.చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

మరియు వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కూడా ఉంటాయి.

ఇక బియ్యం కడిగిన నీటితో హెయిర్ ఫాల్ ను కూడా అడ్డుకోవచ్చు.అందుకోసం అరకప్పు రైస్ వాటర్ లో అరకప్పు ఫ్రెష్ కొబ్బరిపాలు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ హెయిర్ మాస్క్ ను వేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.జుట్టు షైనీ గా సిల్కీగా కూడా మెరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు