గర్భం దాల్చిన మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పౌష్టికాహారం ఇదే!

సాధారణంగా మహిళలలో శారీరక మార్పులు జరుగుతూ ఉంటాయి.గర్భం దాల్చిన తర్వాత వారి శరీరంలో అనేక మార్పులు సంతరించుకుంటాయి.

కొంత మంది మహిళలు పిల్లలు పుట్టాక తమ గురించి ఆలోచించడం మానేస్తుంటారు పిల్లల ధ్యాసలో పడి వారు సరైన ఆహారం తీసుకోకపోవడం ద్వారా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో హార్మోన్ల సమతుల్యత వల్ల వారి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

దానివల్ల వారిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, ఎముకలు బలహీనంగా మారడం, వెన్నునొప్పి, మరికొందరిలో అయితే అధిక బరువు పెరిగి పోవడం లాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయిఈ సమస్యలన్నిటికీ గల కారణం వారు సరైన పౌష్టికాహారం తీసుకోక పోవడమే.మరి ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

మహిళలలో కలిగే శారీరక మార్పులకు అనుగుణంగా వారి ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి.వారు తినే ఆహారంలో ఎక్కువగా విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, క్యాల్షియం విరివిగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

Advertisement

గర్భం దాల్చిన మహిళలు వారు తీసుకునే ఆహారంలో అదనంగా పోషకాలు ఉండేలా చూసుకోవాలి.మంచి పౌష్టికాహారంతో పాటు కూరలు పండ్లు విరివిగా తీసుకోవాలి.

దీని ద్వారా అదనపు పోషకాలు అందడమే కాకుండ, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.బిడ్డకు జన్మనిచ్చిన మహిళలు అయితే క్యాల్షియం అధికంగా కలిగి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఎముకలు బలహీనంగా కాకుండా గట్టిపడతాయి.

మాంసం, డ్రై ఫ్రూట్స్., ఆకుకూరలు వంటివి తీసుకోవడం ద్వారా మధుమేహం, గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్, మోనోపాజ్ వంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.

అంతేకాకుండా రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగడం ద్వారా డీహైడ్రేషన్ వంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.తగిన పోషకాహారం తీసుకోవడం తో పాటు సరైన వ్యాయామ పద్ధతులను కూడా పాటించాలి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు