నదిలో దూకేసిన మహిళలు.. చీరకట్టులో సాహసం..

సోషల్ మీడియాలో ఎన్నో ఆసక్తికర వీడియోలు మనకు కనిపిస్తుంటాయి.ముఖ్యంగా కొందరిని మనం చాలా తక్కువగా చూస్తుంటాం.

కానీ వారి ప్రతిభను గమనించినప్పుడు ఆశ్చర్యపోతుంటాం.ముఖ్యంగా గ్రామీణ మహిళలు అంటే వారిలో తక్కువ ట్యాలెంట్ ఉంటుందని భావిస్తాం.

ఇలా అనుకునే వారి అంచనాలు తప్పు అనిపించేలా కొందరు మహిళలు తమ ట్యాలెంట్‌ చూపించారు. చీర కట్టులో వంతెన పై నుంచి అమాంతంగా నదిలోకి దూకేశారు.

వారి సాహసాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

Advertisement

మీరు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోలు బాగా ఆకర్షిస్తుంటాయి.వాటిని అలాగే చూస్తూ ఉండిపోతాం.ఇదే తరహా ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది.

తమిళనాడులోని ఒక నదిలో చాలా హాయిగా కొందరు మహిళలు ఈత కొడుతున్నారు.అయితే అందులో వింత ఏముందని అంతా అనుకోవచ్చు.

అయితే వారంతా చీరలు ధరించారు.చీర కట్టులో ఎత్తైన వంతెన నుంచి ఏ మాత్రం భయం లేకుండా నదిలోకి దూకేశారు.

ఆ తర్వాత చక్కగా ఈత కొడుతూ, ఇతర మహిళలలతో ముచ్చట్లు పెట్టుకుంటూ సంతోషంగా గడిపారు.

భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
ఒన్స్ మోర్ నీరజ్ చోప్రా.. మళ్లీ గోల్డ్ కొట్టేనా.? ఒలంపిక్స్ లో నేటి భారత్ ఈవెంట్స్ ఇవే..

ఇదంతా తమిరాబ్రానీ నదిలో ఇటీవల జరిగినట్లు తెలుస్తోంది.పైగా ఈ సాహసం చేసిన వారంతా వృద్ధ మహిళలు.దీంతో వారి ధైర్యానికి నెటిజనలు ఆశ్చర్యపోతున్నారు.ఈ ఆసక్తికర వీడియోను ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.20 సెకన్ల క్లిప్‌లో, చీరలు ధరించిన వృద్ధ మహిళల బృందం తమిరాబ్రానీ నదిలో ఉత్సాహంతో డైవింగ్ చేయడం చూడవచ్చు.తామైతే అలా చేయలేమని, ఆ వయసు మహిళలు చీర కట్టులో ఇలా డైవింగ్ చేయడం అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు