మహిళలకు లింగ వివక్షతపై అవగాహన అవసరం:సీడీపీఓ జ్యోత్స్న

యాదాద్రి భువనగిరి జిల్లా:మహిళకు లింగ వివక్షతపై అవగాహన కలిగి ఉండాలని మోత్కూర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ జ్యోత్స్న అన్నారు.శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో గంగాపురం,మరిపడగ, గుండాల,పాచిల్ల అంగన్‌వాడీ కేంద్రాల్లో జిల్లా మహిళా శిశు, వికలాంగ,వయోవృద్ధుల మరియు జిల్లా మహిళా సాధికరత శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని కార్యక్రమాలకు హాజరైన గర్భిణీలు, బాలింతలు,అత్తలు,అమ్మలకు మహిళ సాధికారతపై లింగ సమానత్వం,గృహహింస చట్టం,బాల్య వివాహాలు, పి.

 Women Need Awareness On Gender Discrimination Cdpo Jyotsna , Cdpo Jyotsna, Gende-TeluguStop.com

సి.పి.ఎన్.డి.టి -2012 చట్టం,స్వీయ స్వాతంత్ర్యం గురించి వివరించారు.మహిళాలు అన్ని రంగాల్లో రాణిస్తేనే సాధికరత సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు చీరలు,ఫ్రాకులు పంపిణీ చేశామని జిల్లా మహిళా సాధికారత బృంధం జెండర్ స్పెషలిస్ట్ పి.నిఖిత తెలిపారు.ఈకార్యక్రమంలో సూపర్‌వైజర్ షమీమ్ బీ,అంగన్‌వాడీ టీచర్లు,గర్భిణీ స్త్రీలు, బాలింతలు,తల్లులు,అత్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube