ఆ యాడ్స్ తో జనాల మైండ్ సెట్ మార్చేస్తారా ?

వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న టిడిపి, జనసేన( TDP, Jana Sena ) పార్టీలు దానికి అనుగుణంగానే వ్యూహాలను రూపొందిస్తున్నాయి.

కచ్చితంగా తమ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణను మొదలుపెట్టాయి.

వైసిపి ( YCP )ప్రభుత్వం ఇప్పటి వరకు తాము ప్రజలకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గొప్పగా చెప్పుకుంటూ, జనాల్లోకి వెళ్తుండడంతో టిడిపి కూడా దానికి అనుగుణంగానే జనాలు మైండ్ సెట్ మార్చేందుకు సిద్ధమవుతున్నాయి.దీనిలో భాగంగానే వైసిపి ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే విధంగా నెగిటివ్ యాడ్స్ రూపొందించే పనిలో నిమగ్నం అయ్యింది.

పాజిటివ్ యాడ్స్ కంటే నెగిటివ్ యాడ్స్ ప్రజల్లోకి తొందరగా వెళ్తాయని , అది తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ( Telangana assembly election )కాంగ్రెస్ రూపొందించిన నెగటివ్ యాడ్స్ ప్రజల్లో కి బాగా వెళ్లాయని, బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపించి, జనాల్లో ఆలోచన రేకెత్తించే విధంగా .కాంగ్రెస్ విజయంలో ఈ యాడ్స్ భాగస్వామ్యం అయ్యాయని అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నమ్ముతున్నారు.దీంతో తెలంగాణ కాంగ్రెస్ యాడ్స్ తరహాలోనే ఏపీలోనూ అధికార పార్టీ వైసీపీపై నెగిటివ్ ప్రచారం విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించుకున్నాయి.

Advertisement

ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ కు యాడ్స్ రూపొందించిన వారికే ఈ పనిని అప్పగించినట్లు సమాచారం.తెలంగాణలో బీఆర్ఎస్ పై జనాల్లో వ్యతిరేకత పెంచే విధంగా.పదేళ్ల అహంకారం పోవాలి, పదేళ్ల విధ్వంసం పోవాలి, మార్పు రావాలి- కాంగ్రెస్ కావాలి అన్న నినాదాలు కూడా ప్రజల్లోకి వెళ్లాయి.

దీంతో ఏపీ అధికార పార్టీ వైసీపీ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచే విధంగా రోడ్లు , ఏపీలో అభివృద్ధి కుంటిపడడం, పోలవరం, రాజధాని ఇలా అనేక అంశాల ద్వారా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆధారంగా కొన్ని యాడ్స్ రూపొందించి విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువెళ్లాలని టిడిపి, జనసేనలు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ బాధ్యతలను కొన్ని యాడ్ ఏజెన్సీలకు అప్పగించినట్లు సమాచారం.

దీంతో పాటు, టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఏవిధంగా అభివృద్ధి జరగబోతుందనే దానిని యాడ్స్ రూపంలో జనాల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది.మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చి దానిని అమలు చేయకపోవడం, నాసిరకం మందు ,అమరావతి, ఏపీ లో అభివృద్ధి కుంటి పడడం వంటి అంశాలను హైలెట్ చేస్తూ యాడ్స్ ను తయారు చేయించే పనులు టిడిపి, జనసేన లు ఉన్నాయి.

అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు