Sharmila: తెలంగాణ కాంగ్రెస్ కు షర్మిల చేరిక కలిసొస్తుందా..?

వైయస్ షర్మిల (Y.S.sharmila) రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందిన రాజకీయ నాయకురాలు.

తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎలాగైనా తనకంటూ ప్రత్యేకమైన మార్క్ సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది.

ఈ తరుణంలోనే వైయస్సార్ టిపీ పార్టీ (YSRTP) పెట్టి తెలంగాణలో పలుమార్లు పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గర అయింది.తన తండ్రి ఎలాంటి పథకాలు తీసుకువచ్చారు ప్రజల కోసం ఎలాంటి త్యాగాలు చేశారో వివరిస్తూ ముందుకు సాగింది.

ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆమె పర్యటన సందర్భంగా ఆమెపై దాడులు కూడా జరిగాయి.అయిన పట్టించుకోకుండా తను అనుకున్నది సాధించాలని, పార్టీకీ ఓ గుర్తింపు తీసుకురావాలని కొన్నాళ్లపాటు ప్రయత్నం చేసింది.

ఈ మధ్యకాలంలో కాస్త సైలెంట్ అయిన షర్మిల గురించి అనేక వార్తలు వస్తున్నాయి.ఆమె కాంగ్రెస్ తో చేతులు కలపబోతుందని ఒక వార్త వినిపిస్తోంది.

Advertisement

డీకే శివకుమార్ తో భేటీ

: షర్మిల గత కొన్ని రోజుల కింద కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ( D.K.Shivakumar ) తో భేటీ అయింది.ఈ తరుణంలోనే వైయస్సార్ టిపిని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే డీకే శివకుమార్ కూడా ఢిల్లీ పెద్దల ఆదేశాలతో షర్మిలాను ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

వైయస్సార్ సెంటిమెంట్

: ఒకవేళ డీకే శివకుమార్ ప్రయత్నాలు పలిస్తే మాత్రం షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ టిపిని కాంగ్రెస్ ( Congress ) లో విలీనం చేసే అవకాశం కనిపిస్తోంది.అంతేకాకుండా విలీనం చేసిన తర్వాత ఢిల్లీ అధిష్టానం షర్మిలాకు ఎలాంటి పదవి ఇస్తుంది, ఎలాంటి షరతులు పెడుతుందో ఎవరికి తెలియదు.

ఏది ఏమైనా ఆమెకు కాంగ్రెస్ లో సముచిత స్థానం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది.ఒకవేళ వారు అనుకున్నది సక్సెస్ అయితే మాత్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి ( Y.S.Rajashekhar reddy ) బిడ్డగా తెలంగాణ ప్రజలు తప్పకుండా ఆదరించే అవకాశం కనిపిస్తోంది.

రాబోవు ఎన్నికల్లో షర్మిలతో తప్పకుండా కాంగ్రెస్ కు కలిసి వస్తుందని ఢిల్లీ పెద్దలు వ్యూహం పన్నారు.ఎందుకంటే గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో మంది నిరుపేదలను ఆదుకున్నారు.ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకువచ్చారు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ఇప్పటికీ చాలామంది ఆయనను ఒక దేవుడిలా కొలుస్తారు.ఆయన కూతురు కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది.

Advertisement

షర్మిలా ఏమంటుంది.

వైయస్ఆర్టిపి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలినం చేయబోతున్న వార్తలకు స్పందించిన షర్మిల ( Sharmila ) త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలియజేస్తోంది.

శుక్రవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు.ఈ సందర్భంగా మీడియా ప్రశ్నించగా అన్ని విషయాలు త్వరలో చెబుతానని తెలియజేశారు.

ఆమె చెప్పిన సమాధానం బట్టి చూస్తే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది.

తాజా వార్తలు