నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో రోడ్డుప్రమాదం జరిగింది.ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.
దీంతో ప్రయాణికులు అందరూ రోడ్డుపై పడికాస్తున్నారని తెలుస్తోంది.
ఆరెంజ్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదని మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తున్నారు.