పవన్ కళ్యాణ్ సినిమాల్లో మ్యాటర్ తగ్గుతుందా..? ఇప్పుడు వచ్చే సినిమాల పరిస్థితి ఏంటి..?

మెగా స్టార్ చిరంజీవి(Mega star Chiranjeevi) తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక మొదట్లో ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా సక్సెస్ లను సాధించాయి.

ఆ తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు ఆయనకు సరైన సక్సెస్ అయితే దక్కలేదు.అయినప్పటికి గబ్బర్ సింగ్(Gabbar Singh) సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను అందుకుంటున్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఆయన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

అయినప్పటికి ఆయన సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవుతున్నాయి.ఇక ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్న విషయం మనకు తెలిసిందే.

Advertisement

అయితే ఈ మూడు సినిమాలతో కూడా భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.నిజానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)సినిమాల్లో పస తగ్గింది అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ మీద విమర్శలను గుప్పిస్తున్నారు.

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసే సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.ఇక ఇప్పుడు ఆయన మొత్తం రీమేక్ సినిమాలనే చేస్తున్నాడు .నిజానికి అవి అయితేనే తొందరగా పూర్తి అవుతాయనే ఉద్దేశ్యంతో ఆయన రీమేక్ సినిమాలు చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

మరి మొత్తానికైతే ఆయన సెట్స్ మీద ఉన్న సినిమాలను పూర్తి చేసి వాటిని రిలీజ్ చేసి భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.అలాగే తనను విమర్శించే వాళ్లకి కూడా ఇప్పుడు ఈ సినిమాలతో భారీ కౌంటర్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాలు భారీ సక్సెస్ ని సాధిస్తేనే ఆయన స్టార్ హీరోగా వెలుగొందుతాడు.

లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ అనేది భారీ తగ్గుతుందనే చెప్పాలి.

మీసం తిప్పి మరీ పవన్ ఓజీపై అంచనాలు పెంచిన థమన్.. ఏం చెప్పారంటే?
Advertisement

తాజా వార్తలు