ఆ హామీతో ... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి  ?

రేపు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయ్యింది.

ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మంత్రివర్గ విస్తరణ అంశంతో పాటు,  తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడి( TPCC Chief ) నియామకం పైన చర్చించారు.

కొత్తగా నలుగురు లేదా ఐదుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే తో( Mallikarjuna Kharge ) భేటీ కానున్నారు .ఎల్లుండి ఆషాడ మాసం మొదలు కాబోతున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు రేపు ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది.దీంతో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన నిర్ణయం ఈరోజు రాత్రికి వెలువడనుంది.

ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో 11 మంది మంత్రులుగా ఉన్నారు.మరో 6,7 మందికి చోటు కల్పించేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

అలాగే టి.పిసిసి అధ్యక్షుడు నియామకం పైన ఒక క్లారిటీ రానుంది.రెడ్డి సామాజిక వర్గానికి రెండు,  వెలమ ఒకటి , బీసీలకు ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

Advertisement

మంత్రివర్గం రేస్ లో చాలామంది ఉన్నారు.ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి , పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి , బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు మంత్రి పదవి , నామినేటెడ్ పదవులు దక్కబోతున్నట్లు సమాచారం .మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ , మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తో పాటు,  మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి( Komatireddy Rajagopal Reddy ) మంత్రి పదవి ఫైనల్ అయినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

చామల కిరణ్ కుమార్ రెడ్డిని( Chamala Kiran Kumar Reddy ) భువనగిరి ఎంపీగా గెలిపించడంలో రాజగోపాల్ రెడ్డి సక్సెస్ అయ్యారు.  అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోను తీన్మార్ మల్లన్న( Teenmaar Mallanna ) గెలుపునకు రాజగోపాల్ రెడ్డి కృషి చేశారు.  రెండు రోజుల క్రితం డిసిసిబి చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేలా రాజగోపాల్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి రేవంత్ రెడ్డి అభిమానాన్ని పొందారు.

అలాగే ఎంపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని  గతంలోనే అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం .ఇప్పుడు కొత్తగా విస్తరించే మంత్రి వర్గంలో రాజగోపాల్ రెడ్డి పేరును చేర్చినట్లు సమాచారం.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు