చంద్రబాబు చిరకాల కోరిక నెరవేరుతుందా ?

టీడీపీ అధినేత చంద్రబాబు( N Chandrababu Naidu ) వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఎంత కసిగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

గెలుపు కోసం ఏడుపదుల వయసులోనూ క్షణం తీరిక లేకుండా రోడ్ షోలు నియోజిక వర్గ పర్యటనలు చేస్తూ ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.

కాగా ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఆ పార్టీకి ఎంతో కీలకం.ఎందుకంటే ఈ ఎన్నికల తరువాత చంద్రబాబు రాజకీయాలకు రిటైర్డ్ ప్రకకటించారు.

అందువల్ల ఈ ఎన్నికల్లో ఏ మాత్రం తేడా కొట్టిన 2029 ఎన్నికల నాటికి టీడీపీని నాయకత్వ కొరత ఏర్పడుతుంది.అంతే కాకుండా సి‌ఎం గా పదవి చేపట్టి ఆ తరువాత రిటైర్డ్ కావాలనే ఉద్దేశంతో ఉన్నారు చంద్రబాబు.

ఈ ఎన్నికల్లో టీడీపీ విజయంతో పాటు చంద్రబాబుకు మరో చిరకాల కోరిక కూడా ఉందట.తాజాగా కడప జిల్లాలో( Kadapa district ) జరుగుతున్నా రోడ్ షోలో తన చిరకాల కోరికను బయటపెట్టరాయన.ఇంతకీ ఆ కోరిక ఏంటంటే పులివెందులలో టీడీపీ గెలవడం.

Advertisement

పులివెందుల అనగానే వైఎస్ కుటుంబానికి కంచుకోట.ఇక్కడ వైఎస్ కుటుంబానికి చెందిన వారు తప్పా ఇతరులు గెలిచిన దాఖలాలు లేవు.

అలాంటి నియోజిక వర్గంలో టీడీపీ పాగా వేయడం అంతా తేలికైన విషయం కాదు.అయితే ఈ ఎన్నికల్లో పులివెందులలో వైసీపీ కంచుకోట బద్దలు కొడతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ బరిలో నిలిచే అవకాశం ఉంది.

మరి జగన్ ను ఢీ కొట్టి నిలిచే పులివెందుల నాయకుడి కోసం చంద్రబాబు ఎప్పటి నుంచో జల్లెడ పడుతున్నారు.దానికి తోడు పులివెందుల ప్రజలను టీడీపీ వైపు తిప్పుకోవడం కాస్త కస్టమే కాబట్టి వైసీపీ బలహీన పరిచే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా వివేకా హత్యలో జగన్( Viveka murder case ) పాత్రను పదే పదే ప్రస్తావిస్తూ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ఇంకా పులువెందులలో టీడీపీని గెలిపిస్తే సోలార్ ఎనర్జీ, హైడ్రా ఎనర్జీ తీసుకొస్తామని హామీలు ఇస్తున్నారు.మరి పులువెందులలో గెలవలనే చంద్రబాబు చిరకాల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

Advertisement

మరోవైపు చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయాలని అటు జగన్ కూడా అంతే పట్టుదలగా ఉన్నారు.దీంతో ఈ కంచుకోటల వార్ ఏపీ రాజకీయాలను మరింత రసవత్తరంగా మారుస్తోంది.

తాజా వార్తలు