పుట్టింటికి వెళ్లిన భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త !

మద్యానికి బానిసైన భర్త తరచూ ఇంటికి వచ్చి గొడవపడుతున్నాడని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.దీంతో భర్త తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కుటుంబ కలహాల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.

నగరానికి చెందిన అమర్ శివలాల్ (40) ఓ అధికారి వద్ద డ్రైవర్ గా పని చేస్తుండేవాడు.కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాడు.

Advertisement

ఆర్థికంగా ఇబ్బందులు పెరిగాయి.దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితి.

అప్పుడే మద్యానికి బానిసయ్యాడు.తాగడమే కాకుండా భార్యతో తరచూ గొడవ పడేవాడు.

భార్య ఎంతో ఓపిగ్గా మందలించినా అతని ప్రవర్తన మార్పు రాలేదు.దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్య పుట్టింటికి వెళ్లడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అమర్ శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఛీ.. ఛీ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడాల్సింది పోయి.. చివరకు?

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తను రాసిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు