ఓరి దీని వేషాలో.. పెళ్లి చేసుకున్న కొద్దిసేపటికే భర్త డబ్బు, నగలతో ప్రియుడితో జంప్ అయిన కిలేడీ.. !

మన భరత దేశ సంప్రదాయంలో వివాహానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పెళ్లి అంటే రెండు మనుషుల మధ్య ఏర్పడే సంబంధం మాత్రమే కాదు రెండు మనసులతో పాటు ఇరు కుటుంబాల కలయిక కూడా.

అయితే కొంత మంది మాత్రం పెళ్లికి ఉన్న గొప్పతనాన్ని విస్మరించి పెళ్లిని ఎగతాళిగా మార్చేస్తున్నారు.పెళ్లి అంటే బొమ్మల పెళ్లిలాగా చేస్తున్నారు.

పెళ్ళికి విలువ నివ్వకుండా తాళి కట్టిన భర్తకు అన్యాయం చేసి డబ్బులు,నగలతో ప్రియుడితో చెక్కేసింది ఒక కిలాడీ లేడీ.కనీసం పెళ్లి అయ్యి ఒక గంట కూడా అవ్వలేదు.

కాళ్ళ పారాణి కూడా ఇంకా ఆరకముందే భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్ళిపోయి పెళ్లి అనే మాటకు కళంకితం తెచ్చింది ఓ పెళ్లికూతురు.అది తెలిసి పెళ్లి కొడుకు, వారి బంధువులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

Advertisement

ఈ ఘటన హైదరాబాద్‌ లోని బాలాపూర్‌ లో చోటు చేసుకుంది.అసలు వివరాల్లోకి వెళితే.

బెంగుళూరుకు చెందిన మహమద్ ఇలియాస్‌ అనే వ్యక్తికి పాత బస్తీలోని సమ్రిన్‌ బేగంతో వివాహం నిశ్చయం అయింది.పెళ్ళికి ఇరు వర్గాల కుటుంభ సభ్యులు ఒప్పుకున్నారు.

అయితే పెళ్లి జరగడానికి ముందుగా ఇరు వర్గాల కుటుంబాల మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.అదేంటంటే పెళ్ళికి ముందే పెళ్లికూతురుకు రెండు లక్షల యాబై వేల రూపాయల డబ్బులతో పాటు, కొన్ని నగలను కూడా ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఒప్పందం ప్రకారం పెళ్ళికొడుకు పెళ్ళికి ముందు పెళ్లి కూతురు తరుపు వారికి నగదును అందచేసాడు.ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

వివాహం కూడా బాగానే జరిగిపోయింది.ఆ తర్వాతే పెళ్లి కూతురు అందరికి కళ్ళు చెదిరే ట్విస్ట్ ఇచ్చింది.

Advertisement

పెళ్లి అయిన కొన్ని గంటలకు బ్యూటీ పార్లర్‌ కు వెళ్లి వస్తానని చెప్పి పెళ్ళికొడుకు ఇచ్చిన డబ్బుల సంచిని, నగలతో తన ప్రియుడితో చెక్కేసింది.

ఎంత సేపటికి పెళ్లి కూతురు రాకపోవడంతో పెళ్లికొడుక్కి సందేహం వచ్చి ఇంట్లో వారిని గట్టిగా అడగడంతో అసలు నిజం బయట పడింది.వారు చెప్పిన సమాధానం విని పెళ్లి కొడుకు తాను మోసపోయానని గ్రహించి కోపంతో ఊగిపోయాడు.స్వయానా పెళ్లి కూతురు మేనత్త, చిన్నమ్మలే పెళ్లికూతురును ప్రియుడితో పంపారనే విషయం తెలిసిపెళ్ళికొడుకు ఆశ్చర్యపోయాడు.

పెళ్లి కూతురు తనతో పాటు డబ్బు, నగలను కూడా ఎత్తుకెళ్లిందని తెలిసి నా డబ్బులు, నగలు తిరిగి ఇవ్వాలని లేకుంటే పోలీసు కేసు పెడతానని అమ్మాయి తరుపు బంధువులను బెదిరించాడు.ప్రస్తుతం పెళ్లి కూతురు బంధువులు ఈ మ్యాటర్ ను ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

చూడబోతే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్లే అనిపిస్తుంది కదా.

తాజా వార్తలు