నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) విషయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఆమె ఫేస్ ను ఒక వల్గర్ వీడియో తో మార్ఫింగ్( Morphing ) చేసి సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు షేర్ చేశారు.
ఆ వీడియో కొన్ని నిమిషాల వ్యవధి లో కోట్లాది మంది చూశారు.ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్స్ రష్మిక వీడియో చూసి షాక్ అయ్యారు.
ఆ వీడియో ను ఏఐ టెక్నాలజీ ని( AI ) ఉపయోగించి తయారు చేశారు.ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ లు కూడా ఇది నిజమైన వీడియో కాదా అన్నట్లుగా ఆశ్చర్యం వ్యక్తం చేసే విధంగా మార్ఫింగ్ చేశారు.
రష్మిక ఈ విషయం పెద్దగా స్పందించలేదు.
కానీ ఆమెకు మద్దతుగా కేంద్ర మంత్రి తో సహా అమితాబచ్చన్( Amitab Bachchan ) ఇంకా బాలీవుడ్ కు చెందిన పలువురు స్పందించారు.ఇలాంటి చర్యలు ఏమాత్రం కరెక్ట్ కాదని మార్ఫింగ్ వీడియో పై కామెంట్స్ చేస్తున్నారు.జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ వీడియోను టెలికాస్ట్ చేయడం తో కింది నుంచి మీది వరకు అంతా కూడా ఈ విషయమై స్పందిస్తున్నారు.
కానీ టాలీవుడ్ కి ( Tollywood )చెందిన ప్రముఖులు మాత్రం స్పందించడం లేదు.ఏదైనా తమ వరకు వస్తే తప్ప స్పందించే గుణం టాలీవుడ్ వారికి లేదు అని మరోసారి నిరూపితం అయింది.
ఇప్పటి వరకు రష్మిక పై జరిగిన ఈ ఏఐ దాడి ని నాగ చైతన్య( Naga Chaitanya ) మరియు మృణాల్ ఠాకూర్ లు( Mrunal Thakur ) మాత్రమే ఖండించారు.వారు కాకుండా ఇతర ఇద్దరు ముగ్గురు చిన్న సెలబ్రిటీలు ఖండించారు.అంతే కాకుండా టాలీవుడ్ నుంచి అధికారికంగా ఏ ఒక్కరు కూడా దీని గురించి స్పందించలేదు.తోటి నటికి ఇలాంటి అవమాణం జరగడంతో పాటు, భవిష్యత్తు పై ఆందోళన వ్యక్తం అవుతున్న ఈ సమయంలో ఎందుకు స్పందించడం లేదు అంటూ చాలా మంది తెలుగు సినీ ప్రముఖుల పై విమర్శలు చేస్తున్నారు.