హైదరాబాద్ లో జరగాల్సిన భారత్ – ఆసీస్ టీ20 మ్యాచ్ రద్దు అయింది.వచ్చే నెల మూడో తేదీన ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 మ్యాచ్ వేదిక మారింది.
ఈ మేరకు మ్యాచ్ వేదికను మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటన చేసింది.నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రక్రియ, ఫలితాలు వెలువడనున్నాయన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంది.ఫలితాలు వెల్లడి కానున్న అదే రోజున ఉప్పల్ స్టేడియంలో ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ ఉంది.
అయితే మ్యాచ్ కు బందోబస్తు ఇవ్వలేమని పోలీసులు చెప్పడంతో టీ20 మ్యాచ్ ను బీసీసీఐ బెంగళూరుకు మార్చుతున్నట్లు వెల్లడించింది.







