మల్టీ స్టారర్స్ మూవీస్ అందుకే ఫ్లాప్ అవుతాయి... ఆర్ఆర్ఆర్ గత చరిత్రను తిరగరాసేనా?

గడిచిన కొంత కాలంగా మల్టీ స్టారర్ సినిమాల పట్ల ఫిల్మ్ మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

కొంత కాలంగా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, చివరకు బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని సినిమా పరిశ్రమల్లో ఈ ట్రెండ్ కొనసాగుతుంది.

ఇద్దరు ముగ్గురు టాప్ హీరోలను ఒకే సినిమాలో నటింపజేయడం మూలంగా సినిమా మంచి విజయం అందుకుంటుంది అనేది ఆయా దర్శకనిర్మాతల ఆలోచన.అది కొంత మేరకు వాస్తవం కూడాయి.

అయితే చాలా వరకు మల్టీస్టారర్ సినిమాలు అపజయాలను మూటగట్టుకున్న సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి.వాస్తవానికి మల్టీ స్టారర్ సినిమాలు అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేవు.

దానికి చాలా కారణాలున్నాయి.కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు మల్టీ స్టారర్ సినిమాల పరాజయాలకు కూడా చాలా రీజన్స్ ఉంటాయి.

Advertisement

ఒకే సినిమాలో కలిసి నటించే ఇద్దరు హీరోల మధ్య కూడా శైలిలో చాలా వ్యత్యాసం ఉంటుంది.అందుకే దర్శకులు ఈ సినిమాల్లో చాలా అంశాలను జోడించాల్సి ఉంటుంది.

అటు సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న తోపు హీరోల ఆధిపత్యం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది.కథ వాళ్లకు నచ్చినట్లే ఉండాలనే కండీషన్లు పెడతారు.

అటు పెద్ద దర్శకుల పైత్యం కూడా ఈ సినిమాలు పరాజయం పొందడానికి కారణం అవుతాయి.

నిజానికి కొందరు కమర్షియల్ గా ఆలోచించి మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కిస్తారు.అటు జనాలు కూడా మల్టీ స్టారర్ అనగానే సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటారు.ఆ విపరీతమైన అంచనాలు కూడా సినిమాను ఒక్కోసారి దెబ్బతీసే అవకాశం ఉంటుంది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన .. ఆమెనూ తప్పిస్తున్నారా ? 

గతంలో ఓసారి బాలయ్య సుల్తాన్ అనే సినిమా చేశాడు.ఇది ఓ మల్టీస్టారర్ మూవీ.

Advertisement

అయినా పెద్దగా జనాదరణ దక్కించుకోలేదు.మళ్లీ ఆ తర్వాత మరిన్ని అంచనాలతో జనాల ముందుకు రాబోతుంది త్రిఫుల్ ఆర్ సినిమా.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.దర్శకుడు రాజమౌళి కావడంతో మాములూగానే ఆ స్థాయి హైప్ ఉంటుంది.

అయితే సినిమా ఏమాత్రం అటు ఇటు అయినా.తలకిందులయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు