ఫలాన్ని అలాగే తినేస్తే మంచిదా లేక జ్యూస్ చేసుకుంటే మంచిదా?

ఆరెంజ్ ఫలాన్ని తెచ్చుకోని తినటం కంటే, 60-70 రూపాయలు పెట్టి ఆరెంజ్ జ్యూస్ తాగడంపై ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తారు జనాలు.

అరెంజ్ ని మెల్లిగా తినాలంటే ఓపిక ఉండదు కాబట్టి ఇలా చేస్తారేమో .

కాని అలా తింటేనే మంచిది.ఆరెంజ్ మాత్రమే కాదు, ఏ ఫలాన్ని అయినా, జ్యూస్ చేసుకునే బదులు, అలాగే తినేస్తే మంచిదని అంటున్నారు డాక్టర్లు.

అలా ఎందుకు అనే కదా డౌటు.ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెబితే మీకే అర్థం అయిపోతుంది.350 మిల్లీలీటర్ల కోకోకోలాలో 140 కాలరీలు, 40 గ్రాముల షుగర్ ఉంటుంది.అదే పరిమాణంలో ఆపిల్ జ్యూస్ తీసుకుంటే 165 కాలరీలు, 39 గ్రాముల షుగర్ ఉంటుందట.

ఇక్కడ కూల్ డ్రింక్ కి, ఆపిల్ జ్యూస్ కి పెద్దగా తేడా ఏముంది ? ఇది మాత్రమే కాదు, ఏ ఫలానికి సంబంధించిన ఫలమైనా, జ్యూస్ లాగా చేసుకున్న తరువాత షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.ఇక బాధకరమైన విషయం ఏమిటంటే, ఫలంలో ఉన్న ఫైబర్ శాతం, జ్యూస్ లో పూర్తిగా పడిపోతుంది.

Advertisement

విటిమిన్లు అలానే ఉన్నా ఫైబర్ పడిపోవడం, షుగర్ పెరిగిపోవడం ఏమాత్రం మంచిది కాదు.మీరెంత జ్యూస్ తాగితే, షుగర్ వ్యాధికి అంత దగ్గరవుతారన్న మాట.అలాగే కాలరీలు ఖర్చుపెట్టే పని చేయకుండా జ్యూస్ తాగితే, ఒంట్లో కాలరీలు పెంచుకుంటూ పోతారన్న మాట.అదీకాక, జ్యూస్ తాగాలంటే దాన్ని మరో పాత్రలో పోయాలి, ఆ పాత్ర జ్యూస్ లో మిగిలిన గుణాల్ని కూడా చెడిపేస్తుంది.కాబట్టి, ఫలాన్ని అలానే తినేయ్యండి.

గుడికి ఎందుకు వెళ్లాలి.. వెళ్తే ఏం వస్తుంది?
Advertisement

తాజా వార్తలు