బ్లాక్ బస్టర్ బొమ్మరిల్లును ఎన్టీఆర్ ఎందుకు వదులుకున్నాడో తెలుసా?

బొమ్మరిల్లు.సిద్ధార్థ, జెనీలియా జంటగా నటించిన సినిమా.2006లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓ రేంజిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ఫ్యామిలీతో పాటు యంగ్ జనరేషన్ ను సైతం ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది.

హాసిని నటన, సిద్ధార్థ పడిన తపన సినిమాకే హైలెట్ గా నిలిచాయి.పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి.బొమ్మరిల్లు సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించాడు.

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన భాస్క‌ర్ బొమ్‌ారిల్లు భాస్క‌ర్‌గా మారిపోయాడంటే ఈ సినిమా ఏ రేంజిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చిందట.

నిజానికి బొమ్మరిల్లు సినిమా ముందు ఎన్టీఆర్ చేయాల్సింద‌ట‌.బొమ్మ‌రిల్లు క‌థ‌ను ముందుగా ఎన్టీఆర్‌కు వినిపించాల‌ని ద‌ర్శ‌కుడు భాస్క‌ర్‌కు దిల్ రాజు సూచించాడ‌ట‌.

Advertisement

క‌థ విన్న ఎన్టీఆర్ కు కూడా ఈ సినిమా క‌థ బాగా న‌చ్చింద‌ట.అయితే పలు కారణాల మూలంగా ఈ సినిమా చేయలేనని చెప్పినట్లు వెల్లడించాడు.

స్క్రిఫ్ట్ తనకు ఎంతో నచ్చిందని కూడా చెప్పాడు.

అయితే తనక అప్ప‌ట్లో ఉన్న ఇమేజ్ కార‌ణంగా ఆ సినిమా చేయలేదని ఎన్టీఆర్ వెల్లడించాడు.ఈ సినిమా వచ్చిన సమయంలో ఆయన వరుసబెట్టి మాస్ సినిమాలు చేస్తున్నాడు.ఈ క్లాస్ సినిమాను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే కారణంగా తను ఈ సినిమా చేయలేదని చెప్పాడు.

ఎన్టీఆర్ సినిమా అంటేనే.డ్యాన్సులు, ఫైట్లు ఉంటాయని జనాలు ఆశిస్తారు.ఇందులో అవేమీ ఉండక పోవడంతో ఎన్టీఆర్ ఈ సినిమా చేసే అవకాశాన్ని వదులుకున్నాడు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
వ‌ర్షాకాలంలో ఆ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే జ‌లుబు, దగ్గుకు దూరంగా ఉండొచ్చు!

ఆ ఆర్వాత సిద్ధార్థ ఈ మూవీలో నటించి సూపర్ హిట్ కొట్టాడు.ఎన్టీఆర్ ఓ బ్లాక్ బస్టర్ మిస్సయ్యాడు.

Advertisement

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు.

తాజా వార్తలు