నాగ్ అశ్విన్ కోసం తండ్రితో గొడవపడ్డ అశ్విని దత్ కూతురు చివరికి తోడల్లుడి ఎంట్రీ ..!

వైజయంతి మూవీస్( Vyjayanthi Movies ) అధినేత అశ్వినీ దత్ కుమార్తెలు స్వప్న దత్ మరియు ప్రియాంక దత్ ఎంతో ఫ్యాషన్ తో అలాగే భారీ బడ్జెట్ తో తీసిన సినిమా కల్కి.

ఈ సినిమా తర్వాత ఈ చిత్రానికి డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్నారు.

చూడ్డానికి బక్కపలచగా ఉండి అతి సామాన్యుడిగా కనిపిస్తున్న నాగ్ అశ్విన్ ఇంత గొప్ప సినిమా తీశాడా అంటే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది.అయితే నాగ్ అశ్విన్ నీ దర్శకుడిని చేసింది కూడా దత్తు గారి కుమార్తెలె.

అందుకోసం తండ్రి తో ఓ యుద్ధమే చేశారట.తండ్రితో చాలానే గొడవపడ్డారట.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో( Avade Subrahmanyam ) తొలిసారిగా దర్శకుడిగా మారాడు నాగ్ అశ్విన్.

Advertisement

అయితే అప్పటికే వైజయంతి మూవీస్ తరఫున పదేళ్లుగా నష్టాలు చూస్తున్నారు అశ్విని దత్.శక్తి, జై చిరంజీవ వంటి స్టార్ సినిమాలు సైతం ఫ్లాప్ అయ్యాయి.తండ్రి వద్దంటున్నా ప్రియాంక స్వప్న( Priyanka,swapna ), ఇద్దరు కూడా ఇదే సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలుగా మారారు వారు సైతం డబ్బులు పోగొడుతూనే వచ్చారు.

అలా తండ్రి కూతుర్ని కలిసి 1000 కోట్ల దాకా సినిమాలో డబ్బు పోగొట్టారట.అయితే షార్ట్ ఫిలిమ్స్( Short films ) తీస్తున్న ప్రియాంక కి నాగ్ అశ్విన్ పరిచయం వారి జీవితాన్ని ఒక మలుపు తెప్పింది.

నాగ్ అశ్విన్ ఇచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం కథ తో ఆమె చాలా ఇంప్రెస్ అయ్యారు అలాగే ఆమె సోదరీ స్వప్న కూడా చాలా ఇంప్రెస్ అయింది.ఈ కథ తో సినిమా తీయాలని వారిద్దరూ పట్టుపట్టారు.

అందుకు అశ్విని దత్ ఒప్పుకోలేదు.

కల్కి సినిమా సక్సెస్ అవ్వడం మారుతి కి వరమా.? శాపమా.?
వామ్మో.. 30 రోజుల్లో 5 సార్లు కాటు వేసిన పాము.. అయినా కానీ..

చివరికి భార్గవ్ ప్రసాద్( Bhargav Prasad ) అయినా స్వప్న భర్త అంటే దత్తు గారి మొదటి అల్లుడు మామ అశ్విని దత్ కి తెలియకుండానే నాగ్ అశ్విన్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు.దాంతో సినిమా తీయక తప్పలేదు.కానీ సినిమా చూసేంత వరకు కూడా అశ్విని దత్ కి వారిపై నమ్మకం లేదు.

Advertisement

తీరా సినిమా చూసి కన్నీళ్లతో ఫోన్ చేసి ఈ సినిమా బాగా తీశావ్ అంటూ నాగ్ అశ్విన్ నీ మెచ్చుకున్నారట.ఆ సినిమా తీస్తున్న సమయంలోనే ప్రియాంక నాగ్ అశ్విన్ తో ప్రేమలో పడ్డారు.

వెళ్లి కూడా చేసుకున్నారు.ముందు మీరు పెళ్లికి అశ్వినీ దత్ ఒప్పుకోలేదు.

ఎందుకంటే ఆయనకు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ.కానీ ఆ తర్వాత ఒప్పుకోవాల్సింది వచ్చింది.

ఇప్పుడు వారికి ఇప్పుడు ఒక కొడుకు కూడా ఉన్నాడు.ఇలా పదేళ్ల తరబడి పోగొట్టిన డబ్బుని కల్కి సినిమాతో రాబట్టేశారు వైజయంతి మూవీస్.

తాజా వార్తలు