సినిమా ఇండస్ట్రీ లో ఉన్న నటుల మధ్య ఇగో లు ఉండటం కామన్ గా మనం చూస్తూ ఉంటాం కానీ తమిళ్ ఇండస్ట్రీ( Tamil Industry ) లో ఇద్దరి హీరోల మధ్య మాత్రం ఎప్పుడు పోటీ అనేది ఉంటుంది.ఆ ఇద్దరు హీరోలు ఎవరు అంటే ఒకరు శింబు కాగా, మరొకరు ధనుష్ వీళ్లిద్దరి సినిమాల మధ్య మంచి పోటీ ఉంటుంది అయితే ధనుష్( Dhanush ) ఎప్పుడు శింబు ( Simbu )తో పోటి పడలేదు కానీ శింబు ధనుష్ తో తరుచూ గా పోటీ పడుతూ ఉంటాడు.
అయితే శింబు గురించి మనకు తెలిసిందే ఆయన ఎలాంటి సినిమా లు చేస్తూ ఉంటాడు ఎంత మంది తో లవ్ ఎఫైర్స్ నడిపాడు అనేది అందరికీ తెలిసిందే…అయితే కెరియర్ మొదట్లో ధనుష్ సినిమా ఒకటి ప్లాప్ అయితే శింబు తన ఇంట్లో సంబరాలు కూడా చేసుకున్నాడట.
అలా వీళ్ళిద్దరికీ సినిమాల పరంగా పోటి ఉంటుంది.అలాగే పర్సనల్ లైఫ్ లో కూడా పోటీ ఉంటుంది ధనుష్ భార్య విషయం లో కూడా ఇద్దరి మధ్య అప్పట్లో కోల్డ్ వార్ నదించిందనేది తమిళ్ మీడియా( Tamil Media ) చాలా రకాల వార్తలను కూడా రాసింది… నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోల మధ్య మంచి పోటి ఉండాలి,కానీ ఒకరి సినిమా ప్లాప్ అయితే ఇంకొకరు పండగ చేసుకునేంత పిచ్చి పోటి అయితే ఉండకూడదు అని సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక తమిళ్ ఇండస్ట్రీ లో రజినీకాంత్( Rajinikanth ) అల్లుడు గా ధనుష్ ఇండస్ట్రీ లో మొదట్లో మంచి సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు ధనుష్ పాన్ ఇండియా హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.నిజానికి ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి.ఈయన హీరో నా అనే స్థాయి నుంచి నేషనల్ అవార్డ్ తీసుకునే స్థాయికి ఆయన సినిమా ప్రస్థానం సాగింది అంటే ఆయన ఎంతలా కష్టపడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు…
.