గిన్నెలు కడిగే స్పాంజ్‌ను తినేందుకు ఎగబడుతున్న జనం.. సీక్రెట్ ఇదే!

ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్ అవుతోంది.దీనిని చూసిన జనం గందరగోళానికి గురయ్యారు.

ఆ ఫొటోలో.కొందరు గిన్నెలు కడిగే స్పాంజ్‌ని నమిలేస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే దీని వెనుక నిజం వేరే ఉంది.ప్రస్తుత కాలంలో జనం వింతలు, విడ్డూరాలు చూడటానికి ఇష్టపడుతున్నారు.

దీంతో మార్కెట్‌లో సృజనాత్మకతకు డిమాండ్ పెరిగింది.బేకరీ ప్రపంచంలోకి వెళ్లినప్పుడు అక్కడ కనిపించే సృజనాత్మక మనసును ఆకట్టుకుంటుంది.

Advertisement

గత కొన్ని సంవత్సరాలుగా మనం రకరకాల కేక్‌లను చూసివుంటాం.ఎవరిదైనా పుట్టినరోజు వచ్చినప్పుడు క్రియేటివిటీ జోడించి కేక్ తయారు చేస్తారు.

తైవాన్‌లోని ఒక రెస్టారెంట్‌లో తయారైన ఒక విచిత్రమైన కేక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.తైవాన్‌లో స్పాంజ్ కేక్ బాగా ప్రాచుర్యం పొందింది.

అవును ఈ స్పాంజ్ కేక్.ఇంట్లో పాత్రలను తోమే స్పాంజ్ మాదిరిగా కనిపిస్తుంది.

మొదటిసారి చూసినవారికి పాత్రలు తోమే స్పాంజ్ తింటున్నట్లు కనిపిస్తుంది.మీరు ఈ రెస్టారెంట్‌లో స్పాంజ్ కేక్‌ని ఆర్డర్ చేసినప్పుడు, గిన్నెలు కడిగే స్పాంజ్‌కు ఆర్ఢర్ చేశారని అర్థం.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
వైరల్ వీడియో : ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..

ఈ కేక్ సాధారణ పేస్ట్రీలు లేదా కేక్‌ల కంటే ఖరీదైనది.అయితే మీరు రూపాన్ని చూసి, పరీక్షించినప్పుడు మీరు ఎంత డబ్బు చెల్లించడానికైనా ముందుకొస్తారు.

Advertisement

రెస్టారెంట్‌లో ఈ కేక్‌కి చాలా డిమాండ్ ఉంటుంది.ఈ స్పాంజ్ కేక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపధ్యంలో దీనిని చూసినవారంతా తెగ ఆశ్చర్యపోయారు.

ఈ కేక్ మూడు పొరలతో తయారయ్యింది.ఆకుపచ్చ పొరను సిద్ధం చేయడానికి చిలగడదుంప ఆకులు ఉపయోగించారు.

తద్వారా ఇది ఆరోగ్యకరమైనదిగా చెప్పుకోవచ్చు.మిగిలిన పొరలలో గుడ్లు, పాలు ఉపయోగించారు ఈ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

తాజా వార్తలు