సామాజిక సినిమాలకు నాంది మాలపిల్ల.. బ్రహ్మణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎందుకు?  

తెలుగు సినిమా పరిశ్రమ అనేది పౌరాణిక సినిమాలతో మొదలయ్యింది.చాలా కాలం పాటు అదే ట్రెండ్ కొనసాగింది.

అయితే కొంతకాలం తర్వాత సామాజిక సినిమాలు తెరకెక్కాయి.కొన్ని సినిమాలు విజయవంతం కావడంతో అదే బాటలో నడిచారు చాలా మంది దర్శకనిర్మాతలు.

అయితే 1935 కాలంలోనే ఓ సామాజిక సినిమా తెరకెక్కి సంచనల విజయంసాధించింది.ఆ సినిమా మరేదో కాదు మాలపిల్ల.ఈ సినిమా కథ అప్పటి వరకు ఎవరూ టచ్ చేయలేదు.1938లో ఈ సినిమా విడుదల అయ్యింది.గూడవల్లి రామబ్రహ్మం ఈ సినిమాను తెరకెక్కించాడు.

ఆ రోజుల్లోనే ఈ సినిమాకు లక్ష రూపాయలు ఖర్చు చేసి తెరకెక్కించారు.ఇందులో కాంచనమాల, గోవిందరాజుల సుబ్బారావు, సూరిబాబు కీలక పాత్రల్లో నటించారు.

Advertisement
Why Brahmins Oppose Malapilla Movie , Brahmins, Malapilla Movie, Goodavalli Ra

ఈ సినిమాను కులాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు.ఓ బ్రాహ్మిన్ అబ్బాయి.

ఎస్సీ అమ్మాయితో ప్రేమలో పడటం ఈ సినిమా కథ.అయితే వారి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి అనేది కథలో బాగా చూపించారు.ఈ సినిమా అప్పట్లో చాలా సెంటర్లలో విడుదల అయ్యింది.

అద్భుత విజయాన్ని అందుకుంది.అయితే పలు చోట్ల ఈ సినిమాకు బ్రహ్మణుల నుంచి భారీగా వ్యతిరేకత ఎదురైంది.

ఇందులో బ్రాహ్మణ అబ్బాయి ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తమను అవమాన పరిచేలా ఉందని.బ్రహ్మణులు ఎవరూ సినిమా చూడొద్దనే పిలుపు ఇచ్చారు ఆ కుల సంఘాల పెద్దలు.

Why Brahmins Oppose Malapilla Movie , Brahmins, Malapilla Movie, Goodavalli Ra
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

అంతేకాదు. పలువురు బ్రహ్మణులు ఈ సినిమాను చూశారు.కానీ ఈ సినిమా చూశాక ఇంటికెళ్లి మైల స్నానం చేసేవారట.బ్రహ్మణుల తీరుపైనా అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.

Advertisement

సినిమాను సినిమాలా చూడాలి తప్ప వివాదాలు చెయ్యకూడదనే మాటలు వినిపించాయి.ఎన్ని వివాదాలు ఈ సినిమా చుట్టూ తిరిగినా.

అప్పట్లో అద్భుత విజయాన్ని మాత్రం అందుకుంది ఈ సినిమా.ఈ సినిమా విజయవంతం కావడంతో ఇదే దారిలో పలు సినిమాలు తెరుకెక్కాయి.

పలు సినిమా విజయంవంతం అయ్యాయి కూడా.

తాజా వార్తలు