Anushka Shetty Jr ntr : తారక్ తో నటించే అవకాశాన్ని 7 సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా ?

టాలీవుడ్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్( Jr ntr )జూనియర్ తో ఒక్క సినిమా చేస్తే చాలని వేచి చూసే నటులు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో.

నందమూరి కుటుంబ నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ చిన్నోడు, రెండో చిత్రంతోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు.

తారక్ అంటే ఇష్టపడనివారు ఇండస్ట్రీలో ఎవ్వరు ఉండరు.ఇలాంటి హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే ఏ హీరోయిన్ ఐనా వదులుకుంటుందా? అవకాశమే లేదు.కానీ ఒక హీరోయిన్ మాత్రం ఈ అవకాశాన్ని కాదనుకుంది.

ఏకంగా ఏడు సార్లు తారక్ తో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేసింది.ఆమె ఎవరో కాదండి.

మన దేవసేన అనుష్క.

Advertisement

జూనియర్ ఎన్టీఆర్, అనుష్క కాంబినేషన్ లో 7 సినిమాలు రావాల్సి ఉంది.కానీ ఈ 7 సార్లు అనుష్క ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేసిందట.దీనికి కారణం ఆయన బొద్దుగా ఉండడమే.

కంత్రి( Kantri ) చిత్రానికి ముందు ఎన్టీఆర్ చాలా బొద్దుగా ఉండేవాడన్న విషయం మనందరికీ తెలిసినదే.కానీ తన శరీర ఆకృతి ఎన్నడూ తనలోని కళను ఆపలేదు.

అప్పుడు.ఇప్పుడు.

ఎప్పుడు.జూనియర్ ఒక మంచి డాన్సర్, ఒక మంచి నటుడు, ఒక మంచి మనిషి.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

కానీ అప్పట్లో కొందరు హీరోయిన్ లు జూనియర్ ఎన్టీఆర్ బొద్దుగా ఉన్నారని ఆయనతో కలసి నటించడానికి ఆలోచించేవారట.వాళ్లల్లో అనుష్క( Anushka Shetty ) కూడా ఒకరు.

Advertisement

ఎంత మంది డైరెక్టర్లు ఆమె వద్దకు వెళ్లి అడిగిన, ఎన్టీఆర్ హీరో అనగానే ఆమె రిజెక్ట్ చేసేది.ఇలా ఇప్పటికి ఏడు సార్లు జరిగింది.

తరువాత కొన్నాళ్లకు ఎన్టీఆర్ సన్నగా అయ్యాక ఎన్టీఆర్, అనుష్క కాంబోలో ఒక సినిమా చేద్దాం అని చాలా మంది అనుకున్నా, ఎన్టీఆర్ ఎనర్జీకి ఆమె సరిపోదని మనసు మార్చుకున్నారు.ఇలా వీళ్లిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు.వీళ్లిద్దరు కలిసి నటించిన చిత్రం చింతకాయల రవి( Chintakayala Ravi ) ఒక్కటే.

ఈ చిత్రంలో వీళ్లిద్దరు ఒక పాటలో కొన్ని సెకండ్ల పాటు కలిసి డాన్స్ చేస్తారు.మరి ఫ్యూచర్ లో అయినా వీళ్ళు కలిసి నటిస్తారో లేదో?.వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు