ఉన్నపళంగా అందాల హీరోయిన్ రజిని టాలీవుడ్ ని ఎందుకు వదిలివెళ్ళిపోయింది..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలు ఆయన ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటివారు సినిమాల్లో వారి పక్కన ఎవరు నటించాలి అనేది వారే నిర్ణయించేవారు అలాగే డైరెక్టర్లు ఫలానా వాళ్లని హీరోయిన్ గా తీసుకుంటున్నాం అంటే ఒకవేళ వారికి హీరోయిన్ నచ్చకపోతే మార్చమని చెప్పేవారు అందుకే అప్పట్లో ఒక హీరోయిన్ ని తీసుకున్న తర్వాత ఆమె ప్లేస్ లో ఇంకో హీరోయిన్ వచ్చేది.

నాగేశ్వరరావు హీరోగా నటించిన దేవదాసు లాంటి సినిమాలో కూడా మొదట హీరోయిన్ గా షావుకారు జానకి గారిని తీసుకొని ఆ తర్వాత వేరే వాళ్ళని తీసుకున్నాడు అలా సినిమాల్లో చాలా రాజకీయ లు కూడా జరుగుతాయి.

హీరోలే ఎక్కువగా ఇక్కడ రాజకీయాలు చేస్తారు అని చెప్పడంలో ఎంత మాత్రం తప్పులేదు.అయితే హీరోయిన్లు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ వాళ్లలో నాచురల్ గా అందంగా కనిపించే హీరోయిన్ ఎవరు అంటే కొందరు శ్రీదేవి అనేవారు కానీ ఆవిడ కంటే కూడా అందంగా కనిపించే వారు ఎవరు అంటే కచ్చితంగా జయప్రద గారు అని చెప్పాలి.

జయప్రద గారు తర్వాత అంతే సహజమైన అందంతో ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే అది రజిని గారు.ఆవిడ దాసరి గారు తీసిన బ్రహ్మరుద్రులు సినిమాలో నటించి నటిగా మంచి గుర్తింపు సాధించారు అలాగే వెంకటేష్,నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించారు పెద్ద హీరోలతోనే కాకుండా చిన్న హీరోలు అయిన సుమన్, భానుచందర్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వారితో కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు.

బాలకృష్ణతో సీతారాముల కళ్యాణం, నాగార్జునతో మజ్ను, కలెక్టర్ గారి అబ్బాయి అలాగే రాజేంద్రప్రసాద్ తో అహ నా పెళ్ళంట, బంధువులు వస్తున్నారు జాగ్రత్త లాంటి సినిమాలు చేశారు.అయితే అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్లతో చాలా బ్యాడ్ గా బిహేవ్ చేస్తారని ఆయనతో నటించడానికి ఏ హీరోయిన్ కూడా ముందుకు వచ్చేవారు కాదు.

Advertisement

అయితే తను మాత్రం అవన్నీ పట్టించుకోకుండా రాజేంద్రప్రసాద్ తో కూడా చాలా సినిమాల్లో నటించింది.

అయితే రాజేంద్ర ప్రసాద్ తో నటించినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అని చాలామంది అనేవారు. రజని గారు చాలా మంది హీరోలతో చాలా గొప్ప సినిమాలు తీశారు అలాగే ఆవిడ చాలా అందంగా కూడా ఉంటారు దాంతో అందరూ హీరోలు తనతో నటించడానికి సిద్ధంగా ఉండేవారు.భానుచందర్ తో నటించిన మంచి మనసులు సినిమా లో జాబిల్లి కోసం ఆకాశమల్లే అనే సాంగ్ చాలా ఫేమస్ అయ్యింది ఆ సాంగ్ లో తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతాయి ఆ సినిమాలో తాను నటించిన నటన అమోఘం అని చెప్పాలి.

అలాగే అహ నా పెళ్ళంట సినిమా లో పిసినారి అయిన కోట శ్రీనివాస రావు కూతురు గా నటించి మంచి గుర్తింపు సంపాదించింది అప్పట్లో ఒక పెద్ద కుటుంబం నుంచి వారసుడిగా వచ్చిన హీరోతో ఎక్కువగా సినిమాలు చేసింది అయితే ఒకానొక టైంలో ఆ హీరో రజనీ గారిని లవ్ చేస్తున్నాను అని చెప్పి బాగా ఇబ్బంది పెట్టాడు అప్పటికి ఆయనకి పెళ్లి అయి భార్య కూడా ఉంది.అయిన కూడా రజనీతో మీరు నాతో పెళ్లి కి ఒప్పుకుంటే ఇప్పుడున్న నా భార్యకి విడాకులు ఇస్తానని కూడా చెప్పి తనని బాగా వేధించాడని అప్పట్లో వార్తలు చాలా వచ్చాయి అలాగే ఆ హీరో వాళ్ళ నాన్న రజినిని పిలిచి నువ్వు ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోవాలని చెప్పి ఆమెనీ ఇండస్ట్రీ నుంచి పంపించాడనే టాక్ కూడా ఉంది.

ఏదేమైనా ఇండస్ట్రీలో టాలెంట్ ఉండి పైకి ఎదుగుదాం అనుకున్న ఇక్కడ ఉండే రాజకీయాల వల్ల చాలా మంది ఎదగలేకపోతున్నారు.ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ కొంత మంది చేతిలో చిక్కుకొని ఉందని అప్పుడప్పుడు వార్తల్లో వింటుంటాం కానీ కొన్ని సందర్భాల్లో ఈ వార్తలు నిజమే అని మనకు అనిపిస్తుంటాయి.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు