ప్రస్తుతం రాష్ట్ర ప్రజల దృష్టంతా మునుగోడు ఎన్నికలపైనే ఉంది.ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే మునుగోడు ఎన్నికలు దేశంలోనే అతి ఖరీదైన ఎన్నికలుగా మారాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీ ధర్మాన్ని నమ్ముకుంటే.టీఆర్ఎస్ పార్టీ తన అధికారాన్ని, డబ్బు, మద్యాన్ని నమ్ముకుందన్నారు.
ఈ ఎన్నికలను కురుక్షేత్రంగా పోల్చడానికి కారణం.కేసీఆర్‌కు కౌరవులంటే ఇష్టమే కారణమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.సీఎం కేసీఆర్‌ను కౌరవులుగా పిలవడానికి కారణం.2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలిచింది.అయితే కౌరవులపై ఉన్న మమకారంతో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.తన సంఖ్యా బలాన్ని 100కు తగ్గకుండా చూసుకున్నారు.ఇప్పుడు మునుగోడు ఎన్నికల్లో ఆ నూరు మందిని ప్రచారానికి పంపించాడని బండిసంజయ్ ఆరోపించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఊర్లల్లో తిష్ట వేసి కూర్చున్నారని, మనుగోడు ప్రజలకు ఏం కష్టం ఉంది? ప్రజలకు ఏం కావాలి? వాళ్లేం కోరుకుంటున్నారు? నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక రచిస్తున్నారు? అనే విషయంపై క్లారిటీ లేదు.అధికారం కోసం టీఆర్ఎస్ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని, ఈ విషయాన్ని మునుగోడు ప్రజలే గుర్తించాలన్నారు.తెలంగాణలోని నిరుపేద ప్రజల భవిష్యత్‌కు ఈ ఎన్నికలు ముడిపడి ఉన్నాయన్నారు.కేసీఆర్ అవినీతి, గడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారన్నారు.అందుకే కేసీఆర్ భయంతో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలను మునుగోడు ప్రచారంలో దింపాడన్నారు.

మునుగోడులో తిరుగుతున్న టీఆర్ఎస్ నాయకులు తమ మేనిఫెస్టోలో ఏమేం అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా కృష్ణ, గోదావరి నుంచి సాగు నీరు ఎందుకు అందడం లేదన్నారు.దళితులకు మూడు ఎకరాల భూమి, దళితబంధు పథకాలు ఎక్కడికి వెళ్లాయి.గౌడన్నల కోసం ఎనిమిదేండ్ల నుంచి ఏమీ చెయ్యని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఓట్ల కోసం ‘గౌడ సమ్మేళనం’ అంటూ డ్రామా కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపించారు.
వీటిపై చర్చించేందుకు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి బహిరంగ సభకు సిద్ధమేనా? అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.