సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో నాటు తుపాకీ కలకలం సృష్టించింది.బావుసాయిపేటకు చెందిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన హన్మంతు తుపాకీతో కాల్పులు జరపబోయాడు.దీంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అయితే హన్మంతు అనే వ్యక్తి గతంలో జనశక్తి సానుభూతిపరుడిగా పని చేసినట్లు సమాచారం.ఈ క్రమంలోనే జనశక్తి డంపు చేసే ఆయుధాల్లో ఒకటి తన వద్ద ఉంచుకున్నట్లు తెలుస్తోంది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.