విదేశాలలో ఉండే ఎన్నారైలు తమ సంపాదనలో కొంత భాగాన్ని దాచుకోవడమే, లేదంటే పెట్టుబడులు పెట్టడమో చేస్తుంటారు.కేవలం వారు ఉండే దేశాలలో మాత్రమే కాదు భారత్ లో కూడా పెట్టుబడులు పెడుతూ, కొంత డబ్బును డిపాజిట్ రూపంలో సేవింగ్స్ చేస్తుంటారు.
అందుకుగాను భారత్ లోని బ్యాంక్ లు వారికి కొన్ని వెసులుబాటులు కూడా అందిస్తుంటాయి.అలాగే వారికి ప్రత్యేకమైన సౌకార్యాలు ఇస్తుంటాయి.
అలాగే భారత్ లోని కస్టమర్ లకు ఉండే సర్వీస్ చార్జ్ ఇతరాత్రా చార్జీల కంటే కూడా ఎన్నారైలకు ఎక్కువగానే ఉంటుంది.అయితే తాజాగా ఈ విషయంలో ప్రముఖ ప్రవైటు రంగ బ్యాంక్ ICICI కీలక ప్రకటన చేసింది.
ఎన్నారైల సేవింగ్స్ అకౌంట్స్ కి సంభందించి సర్వీస్ చార్జీలు పెంచుతున్నట్టుగా కీలక ప్రకటన చేసింది.వచ్చే నెల అంటే నవంబర్ 1 నుంచీ ఈ సర్వీస్ చార్జీల వడ్డన మొదలవుతుందని తెలిపింది.
అంతేకాదు ఇతరాత్రా చార్జీలు కూడా పెంచుతోందట ICICI.చెక్కు ద్వారా లావాదేవీలే అత్యధికంగా ఎన్నారై అకౌంట్స్ కు ఉంటాయి కాబట్టి వారి ద్వారా జరిగే లావా దేవీలపై చార్జీలు పెంచుతున్నారట.అంతేనా.
క్యాష్ డిపాజిట్ లు, బ్యాంక్ స్టేట్మెంట్ లు, పాస్ బుక్ వీటన్నిటికి సంభందించిన డూప్లికేట్ ఇష్యూ లపై చార్జీలు కూడా పెరగనున్నాయని వెల్లడించింది.
ఇదిలాఉంటే ఎన్నారై అకౌంట్స్ పై అత్యధిక లాభాలు ఆర్జించేవి ప్రవైటు రంగ బ్యాంకులే ఎందుకంటే సదరు బ్యాంక్ లు ఎన్నారై అకౌంట్స్ పై ఏ బ్యాంక్ లు ఇవ్వలేనట్టుగా ప్రత్యేకమైన సౌకర్యాలు అందిస్తున్న కారణంగానే ఎంతో మంది ఎన్నారైలు సదరు బ్యాంక్ ల వైపు మొగ్గు చూపుతున్నారు.







