రజినీకాంత్, చిరంజీవి మధ్య పోటీలో గెలిచేది ఎవరు..?

రజినీకాంత్( Rajinikanth ) తెలుగు తమిళం అనే తేడా లేకుండా అన్ని భాషలలో సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న రజినీకాంత్ ఈ మధ్య సినిమాల పరం గా చాలా వెనకబడి పోయారని చెప్పాలి నిజానికి రీసెంట్ టైం లో ఆయన చేసిన సినిమాలు అన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి ఇక దాంతో నెల్సన్ కుమార్ లాంటి యంగ్ డైరెక్టర్ తో ఒక భారీ హిట్ కొట్టాలని ఆయన జైలర్ అనే సినిమా చేస్తున్నారు నిజానికి ఈ సినిమా ఇంతకు ముందే రిలీజ్ అవ్వాలి కానీ అనుకొని కారణాల వల్ల ఇది ఆగస్ట్ 10 వ తేదీన రిలీజ్ అవుతుంది.

అయితే రజినీకాంత్ చేసిన చాలా సినిమాలకంటే కూడా ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ ఈ సినిమా మీద ఇప్పటికే చాలా కాన్ఫిడెంట్ గా ఉంది అయితే ఈ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే నే అంటే ఆగస్ట్ 11 కి చిరంజీవి భోళా శంకర్( Bhola Shankar ) సినిమా కూడా రిలీజ్ అవుతుంది.

ఇక జైలర్ సినిమా( Jailer )తో రజిని సాలిడ్ హిట్ వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు కానీ తెలుగు లో చిరంజీవి సినిమా తో పోటీ పడి జైలర్ సినిమా విజయం సాధిస్తుందా అనేది తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాలి.అయితే ఈ రెండు సినిమాల్లో కూడా తమన్నా నే హీరోయిన్ గా నటిస్తుంది.అయితే జైలర్ సినిమా స్ట్రెయిట్ సినిమా కాగా, భోళా శంకర్ సినిమా మాత్రం తమిళం లో సూపర్ హిట్ అయిన అజిత్ హీరో గా వచ్చిన వెదలం సినిమాకి రీమేక్ గా వస్తుంది.

అయితే ఈ రెండు సినిమాల మధ్య మంచి పోటీ అయితే ఉంటుంది అని చాలా మంది చాలా రకాల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు నిజానికి ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించే సత్తా ఉన్న సినిమాలే అని తెలుస్తుంది చూడాలి మరి ఈ రెండు సినిమాల్లో ఎవరి సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు