పాలకొల్లు వైసీపీ తలరాత మార్చేదెవరు?

గత అసెంబ్లీ ఎన్నికలలో 151 స్థానాలు గెలుచుకుని విజయ దుందుభి మోగించినా కూడా వైసీపీకి ( YCP )కొరుకుడు పడని నియోజక వర్గాలుకొన్ని ఉన్నాయి.

అందులో పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గం ఒకటి .

ఇక్కడ తెలుగుదేశం నుంచి గట్టి నాయకుడుగా ఉన్న నిమ్మల రామానాయుడు ఇప్పుడు తెలుగుదేశంలో పార్టీలో అత్యంత కీలక నాయకుడిగా ఎదిగాడు .నిత్యం జగన్ ప్రభుత్వాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టడంలో ముందు ఉండే రామానాయుడు( Ramanaidu ) ను ఓడించడానికి వైసిపి గతం లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటివరకు నెరవేరలేదు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో( assembly elections ) కూడా రామానాయుడుకు తిరుగులేదని ప్రచారం జరుగుతుంది.ముఖ్యంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కావడం, ఫోన్ చేస్తే వెంటనే స్పందించి ప్రతి సమస్యను తాను ముందుండి పరిష్కరిస్తారనే పేరు ఉండడం పాలకొల్లు నియోజకవర్గం ప్రజలకు ఈయన బాగా దగ్గర చేశాయని చెబుతారు .మరోపక్క వైసీపీ పార్టీకి ఇక్కడ సరైన నాయకుడు లేకపోవడం కూడా ఆ పార్టీని వేధిస్తుంది.గత ఎన్నికలలో ప్రజల్లో మంచి పేరు ఉన్న డాక్టర్ బాబ్జి ( Dr.Babji )గారిని వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టినా కూడా ఆయనను చివరి నిమిషంలో ఎంపిక చేయటం, ప్రచారానికి సరైన సమయం కూడా లేకపోవడంతో ఆయన రెండవ స్థానంతో సరిపెట్టుకున్నారు.

ఆ తదుపరి పరిణామాలతో ఆయన రాజకీయం గా పూర్తిగా సైలెంట్ అయ్యారు.అయితే దాని తర్వాత కవురు శ్రీనివాస్( kavuru Srinivas ) కు పాలకొల్లు నియోజకవర్గం వర్గ బాధ్యతలు అందించినా కూడా ఆయన స్థానిక వైసిపి నాయకులను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారని వాదన ఉంది.ఇటీవల కవురు శ్రీనివాస్ ను కూడా పదవి నుంచి తొలగించి గుడాల గోపి ( Gudala Gopi ) అనే కొత్త వ్యక్తికి అప్పచెప్పినప్పటికీ ఆయన సైతం ఆర్థిక అండ దండలు ఉన్నప్పటికీ పెద్ద వాక్చాతుర్యం లేని వ్యక్తి కావడంతో పెద్దగా పార్టీ పుంజుకోలేదన్న వాదన ఉంది.

Advertisement

దాంతో ఇప్పుడు పాలకొల్లులో టిడిపిని ఓడించాలనే వైసిపి కోరిక మరోసారి విఫలమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది .దానికి తోడు జనసేన-తెలుగుదేశం కలిసి పోటీ చేస్తూ ఉండడం తో ఈసారి రామానాయుడు మరింత ఎక్కువ విన్నింగ్ మార్జిన్ తో గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది .మరి రానున్న కాలంలో రామానాయుడుని ఓడించే అభ్యర్థిని వైసిపి ఎంత త్వరగా వెతికి పట్టుకో కలిగితే ఆ పార్టీ కనీసం గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఉంటుందన్నది వినిపిస్తున్న విశ్లేషణల తాలూకూ సారాంశం.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు