ఇండస్ట్రీ లో చిరంజీవి ని టార్గెట్ చేసిన వాళ్లేవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటులు , చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం వాళ్లు మంచి సినిమాలు చేయడమే కాకుండా ఎదుటివారి సినిమాల మీద కూడా పడి ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు.

ఎదుటి హీరో సినిమాలు సక్సెస్ అయితే స్టార్ హీరోలుగా మారతారు.

అనే ఒక దురుద్దేశంతో వాళ్ల సినిమాల పైన బురదజల్లే ప్రయత్నం చేస్తూ వాళ్ల సినిమాలు బాగా ఆడకూడదు అని కోరుకుంటుంటారు.అలాంటివారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నప్పటికీ నవ్వుతూ అంత మన ఇండస్ట్రీ అన్నట్టుగా నటిస్తూ ఉంటారు.

ఇలాంటి వాళ్ల నుంచి హీరోలు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ ఉంటారు.ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) పైన ఇండస్ట్రీలో చాలామంది వ్యతిరేక భావనతో ఉంటారు ఎందుకంటే వాళ్ల వల్ల స్టార్ హీరోగా కానిది చిరంజీవి ఒక్కడి వల్ల అయింది.కాబట్టే చిరంజీవి మీద కుళ్ళు తో అలా టార్గెట్ చేస్తూ ఎప్పుడు ఏదో ఒక విషయం మీద పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతూ ఉంటారు.

ఇక ఆచార్య సినిమా( Acharya ) ప్లాప్ విషయంలో చిరంజీవి కొరటాల( Koratala Siva ) నీ ఉద్దేశించి తను కొన్ని సజెషన్స్ తీసుకుంటే బాగుండేది అనే ఒక చిన్న మాట మాట్లాడినందుకు చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తూ డైరెక్టర్ కి సలహాలు ఇవ్వడం కరెక్ట్ కాదు ఆయన స్వేచ్ఛ ఆయనకి ఉండాలి.చిరంజీవి రేంజ్ లో ఉండి సలహాలు ఇవ్వడం అవి తీసుకోలేదని ఫీల్ అవ్వడం లాంటివి చేయకూడదు అంటూ చిరంజీవి మీద నెగిటివ్ ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు.ఎందుకంటే ఓపెన్ గా విన్నారు కాబట్టి మిగతా వారు చెప్పే మాటలను నమ్మలేదు.

Advertisement

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ మొన్న జరిగిన జైలర్ ( Jailer )సక్సెస్ మీట్ లో డైరెక్టర్ ని తక్కువ చేసి మాట్లాడుతూ అనిరుద్( Anirudh Ravichander ) ని హైప్ చేశాడు.కానీ అక్కడున్న ఎవరు కూడా దాన్ని నెగిటివ్ గా తీసుకోలేదు నెగిటివ్ గా స్ప్రెడ్ చేయకుండా రజనీకాంత్ చెప్పిందాంట్లో వాస్తవం ఉంది అని అంగీకరించారు.

అదే మన తెలుగులో అయితే దాన్నిఇప్పటికే చాలా రకాలు గా ట్రోల్ చేసేవారు.

Advertisement

తాజా వార్తలు