మాస్ సినిమా చేయబోతున్న అవసరాల శ్రీనివాస్ హీరో ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో వాళ్ల సినిమాల ద్వారా ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది తమదైన గుర్తింపుతో మంచి పేరును సంపాదించుకుంటారు.

వాళ్ళు చేసేది ఏ క్యారెక్టర్ అయిన కూడా దాంట్లో 100% ఎఫర్ట్ పెట్టి నటిస్తూ ఇండస్ట్రీలో ఇప్పుడు ఛాన్స్ పోతే ఇంకొక ఛాన్స్ తిరిగి రాదు అన్న రేంజ్ లో నటిస్తారు.

అలాంటి నటులు కొద్ది మంది మాత్రమే ఉంటారు.ఇక అలాంటి వాళ్లలో అవసరాల శ్రీనివాస్( Srinivas Avasarala ) ఒకరు.ఈయన మొదట నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత వరుసగా సినిమాలను డైరెక్షన్ చేస్తూ వచ్చాడు.

ఇక ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఈయన విశ్వక్ సేన్ ని హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు దాంతో ఆయన డైరెక్షన్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది.

Advertisement

ఇక ఇప్పుడు అదే క్రమంలో మస్ కా దాస్ ఆయన విశ్వక్ సేన్ ( Vishwak Sen )ని పెట్టి ఒక కొత్త అటెంప్ట్ చేయబోతున్నట్టుగా వార్తలయితే వస్తున్నాయి.నిజానికి అవసరాల శ్రీనివాస్ తీసిన ఊహలు గుసగుసలాడే( Oohalu Gusagusalade ), జో అచ్యుతానంద సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.అయిన కూడా ఆయన కంటిన్యూస్ సినిమా చేయడం లేదు.

చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఇంకో సినిమా డైరెక్షన్ చేయాలని చూస్తున్నారు.అయితే అవసరాలు శ్రీనివాస్ విశ్వక్ సేన్ కాంబినేషన్ లో వచ్చే సినిమాకి కాళీ అనే పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో మొదటి సారి మాస సినిమా చేయాలని అవసరాల శ్రీనివాస్ చూస్తున్నారు అయితే ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు