ఈ బియ్యంతో చేసిన ఆహారం తింటే షుగర్ సులభంగా తగ్గిపోతుంది..!

షుగర్ వ్యాధి<( Diabetes )తో బాధపడేవారు ప్రస్తుత సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నారు.ఇలాంటివారు ఇప్పుడు చెప్పే బియ్యాన్ని తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 Eating Food Made With This Rice Will Reduce Sugar Easily , Diabetes , Digestive-TeluguStop.com

కెంపులు బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సులభంగా అదుపులో ఉంటాయి.ఈజీగా బరువు కూడా తగ్గవచ్చు.

జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.అయితే కేవలం అన్నమే కాకుండా ఈ బియ్యంతో మనం పలావు ( Palau )కూడా తయారు చేసుకొని తినవచ్చు.

కెంపులతో రుచిగా పలావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Cardamom, Curry, Diabetes, Digestive, Green Pepper, Tips, Palau, Potatoes

కెంపుల పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఒక టేబుల్ స్పూన్ నూనె, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన బంగాళాదుంప, తరిగిన క్యారెట్, తరిగిన బీన్స్,ఉప్పు, పావు టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ దాల్చిన చెక్క( Cinnamon ), ఒక ఇంచు ముక్క లవంగాలు, రెండు ఏలకులు, రెండు అనసపువ్వు, ఒక మరాఠీ మొగ్గ, రెండు బిర్యానీ ఆకులు, ఒక కరివేపాకు రెమ్మ, తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, తరిగిన టమాట, ఒకటి, రెండు గంటల పాటు నానబెట్టిన కెంపులు, ఎర్ర బియ్యం ఒక కప్పు, నీళ్లు మూడు కప్పులు, తీసుకోవాలి.

Telugu Cardamom, Curry, Diabetes, Digestive, Green Pepper, Tips, Palau, Potatoes

తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా గిన్నెలో నూనె వేసి అందులో పచ్చిమిర్చి, బంగాళదుంపలు( Potatoes ), క్యారెట్, బీన్స్, ఉప్పు వేసి బాగా వేయించాలి.ఇక వీటిని సగానికి పైగా వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కకు ఉంచాలి.ఆ తర్వాత అదే గిన్నెలో నెయ్యి వేసి మసాలా దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.

ఇవి బాగా వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.ఆ తర్వాత టమోటా ముక్కలు, తగినంత ఉప్పు వేసి మిక్స్ చేయాలి.ఆ తర్వాత ముక్కలు మెత్తబడిన తర్వాత నీళ్లు పోసి కలపాలి.ఆ నీళ్లు మరిగిన తర్వాత బియ్యం వేసి కలపాలి.ఇక బియ్యం 100% ఉడికిన తర్వాత వేయించిన కూరగాయ ముక్కలు వేసి మిక్స్ చేయాలి.ఆ తర్వాత మూత పెట్టి అన్నం మెత్తగా అయ్యేవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇక పది నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి.ఇక చాలా రుచిగా ఉండే కెంపుల పలావు తయారవుతుంది.ఇక దీనిని ఏ కూరతో తిన్నా కూడా ఎంతో రుచిగా, అలాగే ఆరోగ్యంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube