ఎవరు నెం 1 మెగా హీరో.. నెట్టింట తెగ చర్చలు!

మెగా కుటుంబం లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటి సారిగా తొలి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) రికార్డ్ క్రియేట్ చేసారు.

దీంతో అల్లు ఫ్యాన్స్ మామూలు సంతోషంగా లేరు.

బన్నీ జాతీయ అవార్డు అందుకోవడంతో ఎప్పుడో ఆగిపోయిన టాపిక్ మళ్ళీ ఇప్పుడు షురూ అయ్యింది.మెగా హీరోల్లో నెంబర్ 1 ఎవరు.

ఇప్పుడు సోషల్ మీడియా( Social media ) వేదికగా మళ్ళీ వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్ ఇది.బన్నీనే మెగా కుటుంబంలో నెంబర్ 1 హీరో అంటూ మళ్ళీ మొదలెట్టారు.మెగాస్టార్ వారసత్వాన్ని ముందుకు నడిపించే సత్తా అల్లు అర్జున్ కు మాత్రమే ఉందంటూ మళ్ళీ టాపిక్ హాట్ హాట్ గా సాగుతూనే ఉంది.

అయితే ఫ్యాన్స్ మధ్యలో ఎలా నడుస్తున్న చిరంజీవి( Chiranjeevi ) మాత్రం ఈ విషయాలను సరదాగానే తీసుకుంటారు.అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా అవార్డు రావడంతో ముందుగా అభినందనలు తెలిపింది చిరంజీవినే.అయితే ఫ్యాన్స్ బన్నీ అవార్డు పొందడంతో చరణ్ తో( Ram charan ) పోలిక చేస్తూ కామెంట్స్ చేయడం మంచిది కాదు అనే చెప్పాలి.

Advertisement

చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి స్టార్ డమ్ అందుకున్నారు.అల్లు అర్జున్ ముందు వచ్చిన చరణ్ కూడా బన్నీతో పోటీగా పాన్ ఇండియన్ ఇమేజ్ ఏర్పరుచుకుని రాణిస్తున్నారు.

మెగా ఫ్యాన్స్ రెండుగా చీలి ఇలా విమర్శలు గుప్పించుకోవడం ఎంత వరకు సబబు.స్టార్స్ గా వారు స్పోర్టివ్ గానే తీసుకుంటుంటే ఫ్యాన్స్ మాత్రం విడిపోయి రచ్చ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు