కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

ఖలిస్తానీ (Khalistani)వేర్పాటువాదులకు అండగా నిలుస్తూ.భారత్‌పై విద్వేషం వెళ్లగక్కుతోన్న జస్టిన్ ట్రూడో .

కెనడా ప్రధాన మంత్రి (Justin Trudeau,Prime Minister of Canada)పదవికి రాజీనామా చేయడం అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది.సొంత పార్టీ నుంచే తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.

అయితే తదుపరి నేతను ఎన్నుకునే వరకు ప్రధాని పదవిలో కొనసాగుతానని ట్రూడో ప్రకటించారు.దీంతో కెనడా (Canada)కొత్త ప్రధాని ఎవరు అంటూ రకరకాల పేర్లు తెర మీదకి వస్తున్నాయి.

మార్క్ కార్నీ, లీ బ్లాంక్‌‌‌, క్రిస్టినా ఫ్రీలాండ్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్‌తో పాటు భారత సంతతికి చెందిన అనిత ఆనంద్(Anita Anand of Indian descent), జార్జ్ చాహల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.వీరిలో ఒకరు కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Advertisement

అనితా ఆనంద్(Anita Anand) విషయానికి వస్తే.తల్లి పంజాబ్‌కు చెందిన డాక్టర్ సరోజ్ దౌలత్ రామ్, తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్ సుందర్ వివేక్ ఆనంద్.ఇప్పటికీ వీరి బంధువులు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులలో(Delhi, Mumbai, Chennai, Bangalore) ఉన్నారు.అనిత తాతగారు భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.2019 ఓక్‌విల్లే నుంచి అనిత కెనడా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.తొలుత ప్రజాసేవల మంత్రిగా, తర్వాత రక్షణ మంత్రిగా సేవలందించారు.

గతేడాది రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగా అనితా ఆనంద్ బాధ్యతలు చేపట్టారు.

జార్జ్ చాహల్ విషయానికి వస్తే.కెనడాలో స్ధిరపడిన సిక్కుల్లో ఈయనకు మంచి పట్టుంది.ప్రస్తుతం హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా ఉన్న ఈయన సిక్కుల కాకస్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు.

అలాగే సహజ వనరులపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీకి సారథ్యం వహించారు.అయితే చాహల్.కెనడా లిబరల్ పార్టీ లెజిస్లేటివ్ కాకస్ తాత్కాలిక నేతగా ఉండటంతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అర్హత లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

వైరల్: పీలింగ్స్ పాటకి సెప్పులేసిన ముసలి బామ్మ... రష్మికను మ్యాచ్ చేసిందని కామెంట్స్!
భారతీయుల అక్రమ రవాణా .. యూకేలో ఇద్దరు వ్యక్తులకు జైలు

అయితే ఏదైనా అద్భుతం జరిగి భారత సంతతి నేతలు కనుక కెనడా ప్రధానిగా ఎన్నికైతే మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించినట్లే .

Advertisement

తాజా వార్తలు