అహల్య ఎవరు? ఆమె జన్మ రహస్యం ఏమిటి?

అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ అహల్య నాటకం చేస్తూ బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకోవడం మన అందరికీ తెలిసిన విషయమే.కానీ పురాణాల్లో ఉన్న ఈ అహల్య ఎవరు? అమె జన్మ రహస్యం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తానే స్వయంగా బ్రహ్మ ఓ అత్యంత సౌందర్య వతిని సృష్టించాడే.

ఆమెకు అహల్యగా నామ కరణం చేశాడు.దేవతలు అందరూ ఆమె అందాన్ని చూసి ముగ్ధులయ్యారు.ఆమెను పెళ్లేండుదుకు ఎంతగానో ప్రయత్నాలు చేశారు.

కానీ ముల్లోకాలను ముందుగా ఎవరు అయితే చుట్టి వస్తారో వారికే అహల్యను ఇచ్చి పెళ్లి చేస్తానని బ్రహ్మ చెప్తాడు.ఈ విషయం తెలుసుకున్న ఎంతో మంది దేవతలు, ఋషులూ  ముల్లోకాలు చుట్టేందుకు పయనమవుతారు.

ఇంద్రుడు తన శుక్తులన్నింటిని ఉపయోగించి ముల్లోకాలను చుట్టి వస్తాడు.అహల్యను తనకే ఇచ్చి వివాహం జరిపించాలని బ్రహ్మను కోరతాడు.

Advertisement

ఆ సమయంలోనే నారద ముని వచ్చి ఇంద్రుడి కంటే ముందుగా గౌతమ మహర్షే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని వివరిస్తాడు.గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని… ఆ సమయంలోనే ఆ ఆవు ఓ లేగ దూడకు జన్మనిచ్చిందని చెప్తాడు.

శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమని… అందుకే గౌతమ మహర్షికి ఆ ఫలితం దక్కిందని వివరిస్తాడు.విషయం తెలుసుకున్న బ్రహ్మ అహల్యను గౌతముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు.కానీ ఇంద్రుడు మాత్రం అహల్యపైన కోరికను మాత్రం వదులుకోలేడు.ఇలా గౌతముడి భార్య అయింది అహల్య.

Advertisement

తాజా వార్తలు