Sobhan Babu : అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం అనుకున్న ఆ ఇద్దరు హీరోలు ఎవరు ?

అక్కినేని నాగార్జున( Nagarjuna ) హీరోగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన అన్నమయ్య సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

వెంకటేశ్వరస్వామి భక్తుడు అన్నమయ్యపై తీసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.ఈ సినిమాలోని పాత్రలు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇక అన్నమయ్య పాత్రలో నాగార్జున నటన, వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ నటన అందరినీ అబ్బురపరిచింది.తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మంచి భక్తి సినిమాగా అన్నమయ్య సినిమా ని చెప్పవచ్చు.

ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే అందరూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు.అయితే ఈ చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్( Suman ) చాల అద్బుతంగా నటించాడు.దీంతో ఈ పాత్రకు గాను సుమన్‌కు కూడా మంచి పేరు వచ్చింది.

Advertisement

అచ్చం వెంకటేశ్వర స్వామిని చూసినట్లు ఈ పాత్రలో సుమన్‌ను చూస్తే అలాగే అనిపిస్తుంది.అయితే సుమన్ కంటే ముందు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వరస్వామి పాత్ర కోసం ఇద్దరు హీరోలను అనుకున్నారట.

ఈ పాత్ర కోసం తొలుత హీరో శోభన్‌బాబు( Sobhan Babu )ని అనుకున్నారట.కానీ అప్పటికే శోభన్ బాబు సినిమాలకు గుడ్ బై చెప్పడంతో తిరిగి నటించేందుకు రూ.50 లక్షల రెమ్యూనరేషన్ అడిగారట.

శోభన్ బాబు రెమ్యూనరేషన్ ఎక్కువ అడగడంతో రాఘవేంద్ర రావుకు వేరే హీరో కోసం వెతికారు.దీంతో బాలకృష్ణను సంప్రదించారట.అప్పటికే ప్రముఖ హీరోగా ఉన్న బాలయ్యకు( Raghavendra Rao ) ఇలాంటి పాత్ర ఇస్తే అక్కినేని, నందమూరి అభిమానుల మధ్య గొడవలు వస్తాయోమోనని రాఘవేంద్ర రావు వద్దనుకున్నారట.

ఆ తర్వాత బాగా ఆలోచించి సుమన్ ను వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం తీసుకున్నాడరు.దీంతో సుమన్ ఆ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఎమోషనల్ సీన్స్ లలో నాగార్జున నటన, వెంకటేశ్వర స్వామి పాత్రకు సుమన్ చక్కగా సరిపోవడంతో తెలుగులోనే ఎవర్ గ్రీన్ సినిమాగా ఇది నిలిచింది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

నాగార్జునకు అన్నమయ్య సినిమా మంచి పేరు తెచ్చిపెట్టగా.ఆయనకు అనేక అవార్డులు కూడా వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు