బి‌ఆర్‌ఎస్ ను ఢీ కొట్టే సత్తా ఏ పార్టీదో ?

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో ఈసారి ఎన్నికల్లో గెలుపవరిది అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.రాష్ట్రం ఏర్పడినది మొదలుకొని బి‌ఆర్‌ఎస్ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది.

ఈసారి ఎన్నికల్లో కూడా బి‌ఆర్‌ఎస్( BRS party ) విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.గతంలో కంటే ఈసారి బి‌ఆర్‌ఎస్ ఇంకా ఎక్కువ సీట్లు సాధిస్తుందని కే‌సి‌ఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈసారి గెలుపు విషయంలో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గానే ఉన్నాయి.అయితే బి‌ఆర్‌ఎస్ ను ఢీ కొట్టి నెలిచే సత్తా కాంగ్రెస్ మరియు బీజేపీ( BJP party ) లలో ఏ పార్టీకి ఉందంటే ఎక్కువగా కాంగ్రెస్ పేరే వినిపిస్తోంది.

రాష్ట్రంలో బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.ఇక బి‌ఆర్‌ఎస్ నేతలు సైతం కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారు.అయితే బీజేపీని తక్కువగా అంచనా వేయడానికి లేదు.

Advertisement

ఎందుకంటే జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే కూడా బీజేపీనే మెరుగైన ఫలితాలు సాధించింది.హుజూరాబాద్, దుబ్బాక వంటి నియోజిక వర్గాల్లో కూడా బీజేపీ( BJP )నే విజయం సాధించింది.

దీంతో ఎవరు ఊహించని విధంగా బీజేపీ కూడా పుంజుకునే అవకాశాలు ఉన్నాయనేది కొందరు చెబుతున్నా మాట.

అయితే అభ్యర్థుల పరంగాను, రాష్ట్రంలో ప్రజా మద్దతు పరంగాను కాంగ్రెస్( congress party ) దే పైచేయిగా ఉంది.ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ రెండో జాబితాను కూడా రెడీ చేసింది.బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో తటపటాయిస్తూనే ఉంది.

నియోజిక వర్గాల వారీగా కమలం పార్టీకి అభ్యర్థుల కొరత తీవ్రంగానే వేధిస్తోంది.ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి ఎన్నికల్లో అధికార బి‌ఆర్‌ఎస్ కు కాంగ్రెస్ నుంచే గట్టి పోటీ ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహంలేదు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

మొత్తం మీద అధికారం కోసం పోటీ జరుగుతున్నప్పటికి.రెండో స్థానం కోసం పార్టీలలో అసలు పోటీ కాంగ్రెస్ బీజేపీ మద్యనే నెలకొంది.

Advertisement

ఈ రెండు పార్టీలలో బి‌ఆర్‌ఎస్ ను ఢీ కొట్టి నిలిచే సత్తా ఉన్న పార్టీ ఏదో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఎదురు చూడక తప్పదు.

తాజా వార్తలు