దేవుడా.. ఆ డాక్టర్ అక్కడే ఆటోగ్రాఫ్ ఇచ్చేశాడేంటి..!

మనకు ఇష్టమైన వారు ఇచ్చే ఆటోగ్రాఫుల కోసం మనం ఎగబడతాం.ఎందుకంటే వారి బ్రాండ్ ఆ సంతకంలో ఉందని మనం నమ్ముతాం.

దాన్ని భద్రంగా దాచుకుంటాం.ఇంచు మించు అదీ మనకు ఒక జ్ఞాపకం వంటిదే.

అయితే మనం బుక్స్, పేపర్స్ పై ఆటోగ్రాఫ్ లు తీసుకోవడం చూస్తుంటాం.అదీ కాకపోతే తాము వేసుకున్న డ్రెస్ లపై కొంతమంది ఆటోగ్రాఫ్ లు తీసుకుంటారు.

కానీ, ఎవరైనా లివర్ పై ఆటోగ్రాఫ్ తీసుకోవడం చూసారా.? అంతేకాక లివర్ పై ఆటోగ్రాఫ్ ఇవ్వడం చూసారా.? ఓ పేషెంట్ కు కాలేయ మార్పిడి చేసిన డాక్ట‌ర్ ఆ అవ‌యవం పై త‌న ఆటోగ్రాఫ్ ను చెక్క‌డంతో వార్త‌ల్లోకి ఎక్కాడు.ఈ సంఘటన బ్రిటన్‌ లోని బర్మింగ్‌ హామ్ క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్‌ లో చోటు చేసుకుంది.

Advertisement

ఓ పేషెంట్ కు కాలేయ మార్పిడి చేసిన డాక్ట‌ర్ ఆ అవ‌యవంపై త‌న ఆటోగ్రాఫ్ ను చెక్క‌డంతో వార్త‌ల్లోకి ఎక్కాడు.వివరాల్లోకి వెళ్తే.బ్రిటన్‌ లోని బర్మింగ్‌హామ్ క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్లో డాక్టర్ సైమన్ కాలేయ మార్పిడి కోసం వచ్చిన ఒక మహిళకు ఆపరేషన్ చేసాడు.ఆ సమయంలో డాక్టర్ ఆ మహిళ లివర్ పై 1.6 అంగుళాల సైజులో ఆటోగ్రాఫ్ చేసాడు.అయితే, కొన్ని రోజుల తర్వాత ఆ మహిళకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేరింది.

ఆమెను మరో డాక్టర్ పరిశీలించడంతో ఈ విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది.

కాగా, 2013లో జరిగిన ఈ సంఘటనపై ట్రైబ్యునల్ తీర్పు ఇవ్వడంతో తాజాగా ఈ వార్త సంచలనమైంది.డాక్టర్ ఆర్గాన్ బీమ్ మెషీన్‌ను ఉపయోగించి మహిళ లివర్‌పై ఆటోగ్రాఫ్ పెట్టినట్టు డాక్టర్ సైమన్ ఒప్పుకున్నాడు.దీంతో ఆ డాక్టర్ కు న్యాయస్థానం సస్పెన్షన్ విధించింది.

అంతేకాక ఇకముందు వైద్య వృత్తి నిర్వహించకూడదని తెలియజేసింది.

బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి : మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి...
Advertisement

తాజా వార్తలు