ఆ కారణంతో సినిమాలకు దూరమైన దగ్గుబాటి రాజా?   

మూవీ మొఘల్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డి.రామానాయుడు కుటుంబం నుంచి ఆయన తనయుడు సురేశ్, వెంకటేశ్ ఇండస్ట్రీలో ఆయన వారసులుగా కొనసాగుతున్నారు.

కాగా, రామానాయుడు అన్న కొడుకు దగ్గుబాటి రాజా కూడా హీరోగా ఉన్నారన్న సంగతి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు.కానీ, 90లలో దగ్గుబాటి రాజా నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

అయితే, ఆయన నటించిన చిత్రాలు తెలుగులో కంటే కూడా తమిళ్‌లో బాగా హిట్ అయ్యాయి.తెలుగు, తమిళ ప్రజల విశేష ఆదరణ పొందిన దగ్గుబాటి రాజా ఆ తర్వాత కాలంలో వెండితెరపై కనబడకుండా పోయారు.

నైంటీస్ స్టార్టింగ్‌లో దగ్గుబాటి రాజా నటించిన సినిమాలు వరుసగా విజయం సాధించాయి.ఈ క్రమంలోనే ఇండస్ట్రీ వారు సినీ అభిమానులు హీరోగా స్టార్ రేంజ్‌కు దగ్గుబాటి రాజా త్వరలో వెళ్తాడని అనుకున్నారు.

Advertisement

కానీ, స్టార్ హీరో కాకుండానే దగ్గుబాటి రాజా సినిమాలకు దూరమయ్యారు.అలా కావడానికి కారణం ఆయన సినీ అవకాశాలు రాకపోవడమేనని తెలుస్తోంది.

చాలా కాలం పాటు సినిమాల్లో అవకాశాల కోసం వెయిట్ చేసిన దగ్గుబాటి రాజా. ఆ తర్వాత కాలంలో అవకాశాలు రాకపోవడంతో సినిమాల నుంచి నిష్క్రమించారు.

తన తండ్రి గ్రానైట్ వ్యాపారంలో అడుగుపెట్టి ఇక అక్కడే ఉండిపోయారు.నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ‘ఎన్టీఆర్.కథానాయకుడు’ చిత్రంలో దగ్గుబాటి రాజా కీలక పాత్రలో కనిపించారు.

మొత్తంగా స్టార్ హీరో కావాల్సిన దగ్గుబాటి రాజా బిజినెస్ మ్యాన్‌గానే ఉండిపోవాల్సి వచ్చింది.అవకాశాలు రాకపోవడం వల్లే దగ్గుబాటి రాజా అలా వ్యాపారవేత్తగా మిగిలిపోయారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

అయితే, అప్పట్లో దగ్గుబాటి రాజా అవకాశాల కోసం వెయిట్ చేసే బదులుగా తన బాబాయ్ అయిన రామానాయుడు వద్దకు వెళ్లి ఏదేని అవకాశాల కోసం ట్రై చేస్తో ఎలా ఉండునో పరిస్థితులు అని కొందరు చర్చించుకుంటున్నారు.ప్రజెంట్ చెన్నైల్ ఉంటున్న దగ్గుబాటి రాజా.బిజినెస్ మ్యాన్‌గా సక్సెస్ అయ్యారని పలువురు అంటున్నారు.

Advertisement

గ్రానైట్ వ్యాపారంలో ముందుకు సాగుతున్నారు దగ్గుబాటి రాజా.ఇకపోతే దగ్గుబాటి, అక్కినేని వారి ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో అప్పడప్పుడు కనబడుతుంటారు.

తాజా వార్తలు