ఫోన్లో డిలీట్ అయిన వాట్సప్ మెసేజ్ లు చదవాలనుకుంటున్నారా..?

వాట్సప్ చాట్ లో, వాట్సప్ గ్రూప్ చాట్ లలో మెసేజ్ లు చూడకముందే డిలీట్ అవడం దాదాపుగా అందరూ గమనించే ఉంటారు.డిలీట్ అయిన మెసేజ్ లో ఏముందో అని అందరూ ఆలోచిస్తుంటారు.

అయితే మెసేజ్ పంపిన వారు డిలీట్ చేయడంతో కేవలం మెసేజ్ డిలీటెడ్( Deleted Message ) అని కనిపిస్తుంది.2017 లో వాట్సాప్ లో వచ్చిన డిలీట్ ఫర్ ఎవరీ వన్ అనే ఫీచర్ తో మెసేజ్ పంపినవారు రెండు రోజుల వరకు మెసేజ్ ను డిలీట్ చేసే అవకాశం ఉంటుంది.ఈ ఫీచర్ తో మెసేజ్ డిలీట్ చేస్తే అవతలవారు ఏం మెసేజ్ పంపించారో తెలియక నిరాశకు గురవుతుంటారు.

అయితే కేవలం వాట్సాప్ లోనే( Whatsapp ) కాక ఇంస్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో కూడా డిలీట్ మెసేజ్ ఫీచర్ ను మరింత సూక్ష్మ పద్ధతిలో అమలు చేశారు.

Whatsapp Trick How To Read Deleted Messages Details, Whatsapp Trick , Read Delet

ఈ ఫీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పంపిన మెసేజ్ లో ఏమైనా తప్పులు ఉంటే మెసేజ్ డిలీట్ చేసి సరిదిద్ది మరలా పంపించేందుకు ఈ ఫీచర్ ఉద్దేశించబడింది.కానీ చాలామంది డిలీట్ ఫర్ ఎవరీ వన్ ఫీచర్ ద్వారా విసిగిపోతున్నారు.అయితే డిలీట్ అయిన మెసేజ్ లను తిరిగి పొందడానికి పరిష్కారం ఉంది.

వాట్సప్ సెట్టింగ్ లో చాట్ లు అనే ఆప్షన్ కు ఓపెన్ చేసి చాట్ బ్యాకప్ కి( Chat Backup ) వెళ్లి డిలీట్ అయిన మెసేజ్లను తిరిగి పొందటానికి బ్యాకప్ కోసం చూడండి.కానీ బ్యాకప్ అమలు కావాలంటే యాప్ ను తొలగించి మళ్లీ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ చేయాల్సి ఉంటుంది.

Whatsapp Trick How To Read Deleted Messages Details, Whatsapp Trick , Read Delet
Advertisement
Whatsapp Trick How To Read Deleted Messages Details, Whatsapp Trick , Read Delet

ఈ పద్ధతి కాస్త కష్టంగా ఉండవచ్చు.అలాకాకుండా ఆండ్రాయిడ్ 11లో డిలీట్ చేయబడిన మెసేజ్లను చదవాలంటే ముందుగా సెట్టింగ్స్ కు వెళ్లాలి.ఆ తర్వాత యాప్స్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ స్క్రోల్ చేసి నోటిఫికేషన్ ఎంచుకొని, నోటిఫికేషన్ హిస్టరీ పై నొక్కండి.

ఇప్పుడు డిలీట్ అయిన మెసేజ్లు కనిపిస్తాయి.కావలసిన మెసేజ్ ఓపెన్ చేసి చదివేయొచ్చు.అంతేకాకుండా థర్డ్ పార్టీ ఆప్స్ ద్వారా కూడా ఆన్లైన్లో డిలీట్ అయిన మెసేజ్లు రికవరీ చేయొచ్చు కానీ వీటితో కాస్త జాగ్రత్తగా ఉండడం ముఖ్యం.

Advertisement

తాజా వార్తలు