Tollywood Movies: ఇలాంటి సినిమాలు తీసి సొసైటీ కి ఏం సందేశం ఇస్తున్నారు ?

డైలాగ్ చెప్పడానికి ఎంత బాగుంది.సినిమా తీస్తే జనాలకు సందేశం ఇవ్వాల్సిందేనా ? తీసిన ప్రతి సినిమా జనాలకు ఎదో ఒక మెస్సేజ్ ఇస్తుంది అనుకుంటే పొరపాటే.

ఎవడు ఎలాంటి సినిమా తీసిన ఎవరికి కావాల్సింది వారు తీసుకుంటారు.

ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలను చూస్తుంటే జనాలకు ఏం సందేశం ఇస్తున్నారు అనే సందేహం కలగక మానదు.ఒక సినిమా చూసే పనిషి పై చాల ప్రభావం చూపిస్తుంది.

హీరో ఏం చేస్తే బయట యూత్ అదే చేయాలనీ అనుకుంటారు.ఈ మధ్య వచ్చిన పుష్ప సినిమా చూసాక అతడు చేస్తుంది నేరాలే అయినా తగ్గేదెలా అంటూ యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.

అతడిని ఆదర్శం గా తీసుకుంటున్నారు చాల మంది.ఇక సీతా రామం వంటి ఒక అద్భుతమైన ప్రేమ కథ వచ్చింది.

Advertisement

మరి దీని నుంచి ఎంత మంది ఇన్స్పైర్ అయ్యారు.స్వచ్ఛమైన ప్రేమ కథను అందుకోవాలని, ఇవ్వాలని ఎంత మంది అనుకుంటున్నారు.

మంచిని మంచిగా తీసుకోవాలని చూసే యూత్ కన్నా కూడా చెడుని తొందరగా ఒంట పట్టించుకునే వాళ్లే ఎక్కువ.అందుకే మంచి సినిమాలు విజయవంతం అవ్వడం చాల కష్టం.

హీరో హీరోయిన్ ని ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతూ అక్కడ ఇక్కడ ముట్టుకుంటూ అమ్మాయి పెర్మిషన్ తో సంబందం లేకుండా హాగ్, కిస్ అంటూ వెంటపడితే అందరికి ఆ సినిమా నచ్చుతుంది.

కానీ విలువలు, నైతికత అంటూ సినిమాలు తీస్తే ఎంత మంది థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తారు చెప్పండి.పైగా హీరో ఒక్కటే ఇరవై మంది విలన్ గ్యాంగ్ ని కొడితే కళ్ళు అప్పగించి మరి సినిమాలు చూస్తారు.ఒక గ్యాంగ్ ని వెనకేసుకొని అందర్నీ కొడితే అది హీరోయిజం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

సినిమా అంటే ఖచ్చితంగా ఆరు పాటలు.నాలుగు ఫైట్స్ ఉండాల్సిందే.

Advertisement

లేకపోతే మనకు నచ్చదు.ఏవో అప్పుడప్పుడు సీతా రామం వంటి సినిమాలు విజయం సాధిస్తాయి కానీ అదే కోవలో కాస్త అటు ఇటు గా ఉన్న సినిమాలు అడ్డ్రస్సు లేకుండా పోయినవి చాలానే ఉన్నాయ్.

ఇప్పటికి అయినా ప్రేక్షకుడి మేలుకో.

తాజా వార్తలు