బ్రీత్ సినిమాకి సీనియర్ ఎన్టీయార్ కి సంబంధం ఏంటి..?

నందమూరి ఎన్టీఆర్ పెద్ద కొడుకు అయిన జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ( Nandamuri Chaitanya Krishna ) హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాకి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకుడు వ్యవహరిస్తున్నాడు.

ఇంతకుముందు వంశీకృష్ణ ఆకెళ్ళ రక్ష, జక్కన్న లాంటి సినిమాలను తెరకెక్కించాడు.ఇక ఈయన ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ సినిమా సక్సెస్ అయితేనే ఆయన సినీ కెరీర్ అనేది ముందుకు సాగుతుంది.

లేకపోతే ఆయన ఇండస్ట్రీ లో కొనసాగడం కష్టమే.ఇక ఈ సినిమాని జయకృష్ణ బసవతారక రామ్ ఆర్ట్స్ పైన ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో చైతన్య కృష్ణ ఒక డీసెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇంతకుముందు కూడా చైతన్య కృష్ణ ఒకటి, రెండు సినిమాలు చేసినప్పటికీ అవి ఆయనకి పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు.ఇప్పుడు బ్రీత్ అంటూ మన ముందుకి వస్తున్నాడు.

Advertisement

అయితే ఈ సినిమాలో ఈయన పోషించిన క్యారెక్టర్ ని డైరెక్టర్ చాలా అద్భుతంగా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా ట్రైలర్ ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయంటూ కామెంట్ చేయడం నిజంగా చైతన్య కృష్ణ కి ఒక మంచి బుస్టాప్ ని ఇస్తున్నట్టు గా తెలుస్తుంది.

ఎందుకంటే ఇప్పుడు కనుక ఆయన ఒక మంచి హిట్ తో మార్కెట్లోకి వస్తే వరుసగా సినిమాలు చేసుకుంటూ ఆయన కూడా మంచి హీరోగా ఎదిగే అవకాశాలు అయితే ఉన్నాయి.ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో సినిమాలు చేస్తే ప్రతి హీరో కూడా చాలావరకు సక్సెస్ అవుతాడు ఎందుకంటే ఈ జానర్ లో సినిమాలు కంటెంట్ ని బేస్ చేసుకుని నడుస్తూ ఉంటాయి కాబట్టి హీరోని పెద్దగా పట్టించుకోరు అందువల్ల హీరో ఎలా ఉన్నా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా ఆడుతూ ఉంటాయి.అయితే బ్రీత్ సినిమా( Vamsi Krishna ) చేయడం వెనుక చైతన్యకృష్ణ ఒక ఆసక్తికరమైన కథను చెప్పారు ఏంటి అంటే వాళ్ల తాత పేరు నిలబెట్టడానికి ఒక మంచి కథ దొరుకితే సినిమా చేయాలనే ఉద్దేశ్యం తో ఆయన చాలా రోజుల నుంచి తిరుగుతున్నట్టు గా తెలుస్తుంది.

ఇక అతనికి ఇప్పుడు ఈ బ్రీత్ అనే స్టోరీ తగలడంతో ఆయన ఈ సినిమా చేస్తున్నట్టు గా తెలియజేశాడు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు