"జగనన్న విద్యా కానుక" అనేది కుంభకోణం అంటున్న నాదెండ్ల మనోహర్..!!

ఏపీ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్య కానుకపై( Jagananna vidya kaanuka ) జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.“జగనన్న విద్యా కానుక”లో భారీ స్కాం జరిగిందని ఆరోపించారు.రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తామని తెలియజేశారు.జగనన్న విద్యా కానుక లో ₹120 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొననారు.“నాడు నేడు” పేరిట నిధులను మళ్లించి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి ఇచ్చే వస్తువులలో నాణ్యత సరిగ్గా లేదని అందులో కుంభకోణం జరిగిందని అన్నారు.

 Nadendla Manohar Says That Jagananna Vidya Kaanuka Is A Scam Janasena, Nadend-TeluguStop.com

మంగళగిరిలో జనసేన పార్టీ( Janasena party ) కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వ పాఠశాలలలో 35 లక్షల మంది విద్యార్థులు.

పర్చేజ్ ఆర్డర్ 42 లక్షల మంది విద్యార్థులకు.

పేద విద్యార్థుల ముసుగులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు.

రోజుకో వైసీపీ స్కామ్ బహిర్గతంలో భాగంగా తొలిరోజు విద్యా శాఖలో అవినీతిపై మీడియా సమావేశం నిర్వహించినట్లు స్పష్టం చేశారు.ఈ క్రమంలో విద్యార్థులకు షూస్, బ్యాగులు సరఫరా చేసిన కంపెనీల పై ఈడీ దాడులు చేయాలని.

ఢిల్లీలో తీగలాగితే ఆంధ్రాలో డొంక కదులుతోంది అని అన్నారు.ఉత్తరాంధ్ర నుంచి తాడేపల్లి వరకు అందరి కథ ఈడీ దగ్గర ఉంది.

ఈడీ సమగ్ర విచారణలో మరింత అవినీతి బయటికి వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.గ్లోబల్ విద్యార్థులను తయారు చేస్తామని ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు.

“నాడు నేడు”కు బడ్జెట్ లో కేటాయించిన నిధులను.ఖర్చు చేయలేదని.

వంటశాలలు, ప్రహరీ గోడలు, నిర్మించకుండా దగా చేశారని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.నిధుల మళ్లింపు విషయంలో కేంద్రం వెంటనే స్పందించాలని నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో జరిగిన అవినీతిపై సీఎం జగన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube