అమ్మవార్ల పక్కనే కాపలాగా పోతరాజు ఎందుకుంటాడు?

గ్రామాల్లో ఉండే పెద్ద పోచమ్మ, నల్ల పోచమ్మ ఎల్లమ్మ, పెద్దమ్మ, మాంకాళమ్మ, పొలేరమ్మ, మాతమ్మ, మావూళ్లమ్మ.

వంటి దేవతలకు అన్న వేళలా అండగా ఉండే వాడే పోతరాజు.

ఆయననే కొన్నిచోట్ల పోతురాజు అని కూడా పిలుస్తారు.అసలు పోతరాజు అమ్మవార్లకు కాపలాగా ఎందుకు మారాడో తెలుసుకుందాం.

అమ్మ, అమ్మవారు, తల్లి లాంటి పేర్లతో మొత్తం మనకు ఏడుగురు దేవతలు ఉన్నారు.ఆ సప్త మాతృలకు పోతరాజే సోదరుడు.

పురాణాల ప్రకారం శివపార్వతులకు కుమారులు కలిగాక.ఒకనాడు వారు విహారానికి వెళ్తారు.

Advertisement

అక్కడ పార్వతీదేవి ఓ కొలను లోంచి ఏడు దోసిళ్ల నీళ్లు తాగగానే సద్యోగర్భంలో ఏడుగురు కన్యలు పుట్టారు.నీళ్లు తాగిన వెంటనే పిల్లలు పుట్టడం అర్ధం కాని పార్వతీదేవి పరమేశ్వరుడి చెంతకు చేరింది.

ఇదేంటని ప్రశ్నించగా.వారి జన్మ రహస్యం గురించి వివరిస్తాడు శివుడు.

అమ్మవారు ఆ కూతుళ్లను వెంట తీసుకెళ్దామంటే.శివుడు వారించి వద్దంటాడు.ఆ ఏడుగురిది స్వతంత్ర ప్రవృత్తి అని.మన మాట వినరని వివరిస్తాడు.అందుకే వారిని ఇక్కడే వదిలేసి వెళ్దామంటాడు.

వారికి కాపాలాగా ఒక గణాన్ని సృష్టిస్తారు.అతడికి పోతరాజు అని పేరు కూడా పెడ్తారు.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్27, శుక్రవారం 2024

ఆ ఏడుగురిని పోతరాజే కాపాడాలని చెప్పి.పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి వెళ్లిపోతారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు పోతరాజు.

Advertisement

వారికి కాపాలా కాస్తూనే ఉన్నాడు.ఆ ఏడుగురే పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జక్కులమ్మ, కామవల్లి, శర్వాణి.

ఈ పేర్లనే పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ అంటూ.ఒక్కో చోటు ఒక్కోలా పిలుచుకుంటుంటారు.

తాజా వార్తలు