కిసాన్ రైల్ అంటే ఏమిటి? ఎవ‌రికి ప్ర‌యోజ‌నం? ఏమార్గంలో న‌డుస్తుందో తెలిస్తే..

భారతీయ రైల్వే రైతుల కోసం ప్రత్యేక రైలును నడుపుతుందని మీకు తెలుసా? దీనిని కిసాన్ రైలు అని పిలుస్తారు.

ఈ రైలులో కూరగాయలు మరియు పండ్లు మాత్రమే ర‌వాణా అవుతాయి.

ఈ రైళ్ల ద్వారా రైతులు తమ కూరగాయలు మరియు పండ్లను సులభమైన మార్గంలో, త్వరగా మరియు చౌకగా ర‌వాణా చేయ‌గలుతారు.దీనితో పాటు, పాలు, మాంసం మరియు చేపలతో సహా త్వరగా పాడైపోయే ఆహార పదార్థాలు రవాణా అవుతాయి.

కిసాన్ రైలు ప్ర‌తి చిన్న స్టేషన్‌లోనూ ఆగుతుంది.ఫ‌లితంగా వ్యాపారులు సులభంగా సరుకులను తీసుకెళ్ల గ‌లుగుతారు.

ప్రస్తుతం ఈ రైళ్లు భారతదేశంలోని ఐదు మార్గాల్లో మాత్రమే న‌డుస్తున్నాయి.ఇది ఉత్తర భారతదేశ రైతులను దక్షిణ భారతదేశంతో కలుపుతోంది.

Advertisement

మహారాష్ట్రలోని దేవ్‌లాలీ నుండి బీహార్‌లోని దానాపూర్‌కు, అనంతపురం (ఆంధ్రప్రదేశ్) నుండి ఆదర్శ్ నగర్ (ఢిల్లీ)కు, బెంగళూరు నుండి హజ్రత్ నిజాముద్దీన్, నాగ్‌పూర్ నుండి ఢిల్లీ, ఇండోర్ నుండి గౌహతి మార్గంలో కూడా రైళ్లు నడుస్తున్నాయి.కిసాన్ రైల్ ద్వారా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ఈ రైలు లక్ష్యం.రైతులకు రవాణా సౌకర్యం లేని చోట కిసాన్‌ రైల్‌ను ప్రారంభించి ప్ర‌భుత్వం` వారిని  ఆదుకుంటోంది.

ఈ రైళ్ల‌లో రిఫ్రిజిరేటర్లతో కూడిన బోగీలు ఉంటాయి.వీటికి కూరగాయలు, పండ్లు, పాలు మొదలైన ప‌దార్థాలేవీ చెడిపోకుండా అవి ప‌రిర‌క్షిస్తాయి.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement
" autoplay>

తాజా వార్తలు